రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
మొహాలి: పాకిస్తాన్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 5.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ స్కోరు 42 పరుగుల వద్ద వన్ డౌన్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ (9 పరుగులు: 6 బంతుల్లో 2 ఫోర్లు)ను వాహబ్ రియాజ్ బౌల్డ్ చేశాడు. రావడంతోనే దూకుడుగా ఆడుతూ రెండు బౌండరీలు కొట్టిన వార్నర్ రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు.
అంతకుముందు జట్టు స్కోరు 28 పరుగుల వద్ద ఆసీస్ ఓపెనర్ ఖవాజా ఖవాజా (21: 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ ) రియాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఖవాజా మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ చెత్తబంతును బౌండరీలను తరలించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచాడు. కానీ, జట్టు స్కోరు వేగంగా పెంచే క్రమంలో రియాజ్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి.. రెండు బంతుల తర్వాత ఔటయ్యి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆరోన్ ఫించ్ (11 ), కెప్టెన్ స్టీవ్ స్మిత్(0) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రియాజ్ రెండు వికెట్లు తీశాడు.