Jr NTR Tweet On Team India Sensational Win Against Pakistan In T20 Worldcup, Goes Viral - Sakshi
Sakshi News home page

Jr NTR Tweet On Team India: టీమిండియా సంచలన విజయం..కోహ్లీకి ఎన్టీఆర్‌ ప్రశంస

Oct 23 2022 7:20 PM | Updated on Oct 23 2022 8:33 PM

Junior NTR Tweet On Team India Sensational Win Against Pakistan in T20 Worldcup - Sakshi

వాట్‌ ఏ విన్.. వాట్‌ ఏ మాసివ్ ఫర్ఫామెన్స్.. కింగ్ కోహ్లీ కా కమాల్.. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ సెన్సేషనల్ విన్. ఇలా ఏ పదం వాడినా టీమిండియా ఘనతను వర్ణించడానికి సరిపోదేమో. అలాంటి విజయాన్ని సాధించింది టీమిండియా. 30 పరుగులకే టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ చివరి ఓవర్లో చివరి బంతికి దాయాది పాకిస్తాన్‌పై గెలుపును రుచి చూసింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి టోర్నీలో ఘనంగా బోణి కొట్టింది. తాజాగా ఈ ఘనవిజయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. 

(చదవండి: జపనీస్ భాష నేర్చుకుంటున్న ఎన్టీఆర్.. యువతులతో సరదా సంభాషణ..!)

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్: నరాలు తెగే ఉత్కంఠకు తెరతీసిన మ్యాచ్‌పై తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ సైతం స్పందించాడు. టీమిండియా ఘనతను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. ఈ మేరకు టీమిండియా ప్రదర్శను పొగుడుతూ ట్వీట్‌ చేశారు. ' చాలా అద్భుతమైన ఛేదన , కోహ్లీ అండ్ టీం సంచలన విజయం సాధించింది. నేను మ్యాచ్‌ను చాలా ఎంజాయ్ చేశాను' అంటూ ట్వీట్‌ చేశారు. జూనియర్ సైతం టీమిండియా ఘనతకు ఫిదా అయ్యారు.  అది కాస్తా వైరలవడంతో అభిమానులు రీ ట్వీట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement