pakistan Vs India
-
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి ప్లేయర్‌గా రికార్డు
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి రుజువు చేసింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆదివారం న్యూయర్క్ వేదికగా పాక్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.ఈ విజయంతో టీమిండియా సూపర్-8కు అడుగు దూరంలో నిలవగా.. పాకిస్తాన్ మాత్రం వరుస ఓటములతో తమ సూపర్-8 ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇక భారత విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైన పాండ్యా.. బౌలింగ్‌లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. హార్దిక్ తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాండ్యా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌పై టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హార్దిక్ రికార్డులకెక్కాడు.పాక్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా.. 13 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా పాక్-భారత్ మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కూడా పాండ్యానే కావడం గమనార్హం. పాండ్యా తర్వాత ఉమర్ గుల్(11), భువనేశ్వర్ కుమార్(11) ఉన్నారు. -
కోహ్లి ‘జెర్సీ’ మారింది!
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి కాస్త గందరగోళానికి కేంద్రంగా మారాడు. మైదానంలోకి దిగినప్పుడు అతను వేసుకున్న జెర్సీ సహచరుల జెర్సీకంటే భిన్నంగా ఉండటంతో సమస్య మొదలైంది. సాధారణంగా టీమ్ కిట్ స్పాన్సర్ ‘అడిడాస్’కు సంబంధించిన మూడు అడ్డగీతలు మన ఆటగాళ్ల జెర్సీల భుజాలపై తెల్ల రంగులో కనిపిస్తాయి. కానీ వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన జెర్సీపై త్రివర్ణ పతాకాన్ని పోలిన రంగులతో ఈ గీతలు కనిపిస్తాయి. అయితే కోహ్లి తెలుపు గీతల టీ షర్ట్‌తోనే వచ్చేశాడు. ఆరు ఓవర్లు ముగిసేవరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత విషయం తెలియడంతో కోహ్లి ఏడో ఓవర్లో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి జెర్సీని మార్చుకొని తర్వాతి ఓవర్లో గ్రౌండ్లోకి వచ్చాడు. -
ODI World Cup 2023: 'అష్ట' దిగ్భంధనం
వన్డే వరల్డ్ కప్‌లో లెక్క మారలేదు. 31 ఏళ్లుగా పాకిస్తాన్‌పై వేర్వేరు వేదికల్లో కనిపించిన ఆధిపత్యం అహ్మదాబాద్‌లోనూ కొనసాగింది. ఫేవరెట్‌గా భావించిన భారత జట్టు అన్ని రంగాల్లో చెలరేగి పాక్‌ను ఊపిరాడనీయకుండా చేసింది. ఒకవైపు భారత బౌలర్లంతా సమష్టిగా చెలరేగుతుంటే... మరోవైపు లక్ష మంది జనం ‘భారత్ మాతాకీ జై’ అంటూ హోరెత్తిస్తుంటే... మైదానంలో దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది... బ్యాటింగ్‌లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక... కనీసం 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది... ఆపై మొదటి బంతి నుంచే ఇండియా జోరు మొదలైంది... సిక్సర్లతో చెలరేగిపోతున్న రోహిత్ శర్మను నిలువరించలేక పాక్ బౌలర్లు చేతులెత్తేయగా మరో అలవోక విజయం మన ఖాతాలో చేరింది. ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించిన టీమిండియా వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యరి్థపై తన అజేయ రికార్డును ఘనంగా నిలబెట్టుకుంది. 8–0తో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో తిరుగులేకుండా దూసుకుపోతున్న భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. పటిష్టమైన టీమిండియా అంచనాలకు అనుగుణంగా చెలరేగి పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి హోరాహోరీ, పోటాపోటీ లేకుండా సాగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్న్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 50; 7 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (69 బంతుల్లో 49; 7 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఒకదశలో 155/2తో మెరుగైన స్థితిలో కనిపించిన పాక్ 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/19) రెండు కీలక వికెట్లు తీయగా... పాండ్యా, కుల్దీప్, జడేజా, సిరాజ్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్న్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ గెలుపును సులువుగా మార్చగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం పుణేలో బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఆ భాగస్వామ్యం మినహా... పాకిస్తాన్ తమ ఇన్నింగ్స్‌ను సానుకూలంగానే ప్రారంభించింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (38 బంతుల్లో 36; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (20) ఒత్తిడికి లోనుకాకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. అయితే షఫీక్‌ను సిరాజ్ ఎల్బీగా అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇమామ్‌ను పాండ్యా వెనక్కి పంపించాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత సీనియర్లు బాబర్, రిజ్వాన్‌లపై పడింది. జడేజా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా... బ్యాటర్ రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. ఇద్దరు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిరి్మంచే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 57 బంతుల్లో బాబర్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే సిరాజ్ వేసిన చక్కటి బంతి స్టంప్స్ పైభాగాన్ని తాకడంతో బాబర్ అదే స్కోరు వద్ద నిరాశగా ని్రష్కమించాడు. అంతే... ఆ వికెట్ తర్వాత పాక్ పతనం వేగంగా సాగింది. కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టగా, బుమ్రా ఆఫ్కటర్కు రిజ్వాన్ బౌల్డ్ కావడంతో భారీ స్కోరుపై పాక్ ఆశలు వదులుకుంది. మిగిలిన నాలుగు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేయడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు. పాకిస్తాన్‌పై 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ (మొహాలిలో) తరహాలోనే భారత్ తరఫున ఐదుగురు బౌలర్లు తలా 2 వికెట్లు పంచుకోవడం విశేషం. మెరుపు బ్యాటింగ్... డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్... రోహిత్ శర్మ అలవోకగా వేర్వేరు దిశల్లో బాదిన ఆరు సిక్సర్లు ఇవి! స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఛేదించేందుకు సిద్ధమైన తరుణంలో స్టేడియంలోని అభిమానులకు ఇదే తరహా రోహిత్ ఆట వినోదం పంచింది. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్‌తో మొదలు పెట్టిన రోహిత్ ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ను ముగిద్దామా అన్నట్లుగా వేగంగా దూసుకుపోయాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 16; 4 ఫోర్లు), కోహ్లి (18 బంతుల్లో 16; 3 ఫోర్లు) మాత్రం విఫలమయ్యారు. షాదాబ్ చక్కటి క్యాచ్‌కు గిల్ వెనుదిరగ్గా, పేలవ షాట్ ఆడి కోహ్లి ని్రష్కమించాడు. అయితే రోహిత్ జోరును మాత్రం పాక్ అడ్డుకోలేకపోయింది. 36 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా పాక్ బౌలర్లను వదలకుండా మరో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదిన రోహిత్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ విజయానికి మరో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో అవుటై రోహిత్ వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం అయ్యర్, కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించారు. నవాజ్ వేసిన 31వ ఓవర్ మూడో బంతిని నేరుగా శ్రేయస్ బౌండరీకి తరలించగా అతని అర్ధసెంచరీతో పాటు భారత్ విజయం పూర్తయింది. మా బౌలర్లే ఈ రోజు మ్యాచ్ ఫలితాన్ని శాసించారు. పాక్ కనీసం 290 వరకు వెళుతుందనుకుంటే 191 పరుగులకే కట్టడి చేయడం అద్భుతం. బౌలర్లంతా సమష్టిగా సత్తా చాటారు. అందరూ అన్ని రోజుల్లో బాగా ఆడలేరు. మనదైన రోజును మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవాలి. నేను అదే పని చేశాను. కెప్టెన్న్గా కూడా నాపై అదనపు బాధ్యత ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌ను మేం మరో ప్రత్యర్థిగానే చూశాం తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. మేం గత రికార్డును పట్టించుకోలేదు. ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టక ముందే జట్టులో అందరికీ తమ బాధ్యతలపై స్పష్టత ఉంది. అందుకే అందరూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ విజయంతో మేమేమీ అతిగా ఉప్పొంగిపోవడం లేదు. టోరీ్నలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్న్ స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) సిరాజ్ 20; ఇమామ్ (సి) రాహుల్ (బి) పాండ్యా 36; బాబర్ ఆజమ్ (బి) సిరాజ్ 50; రిజ్వాన్ (బి) బుమ్రా 49; షకీల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 6; ఇఫ్తికార్ (బి) కుల్దీప్ 4; షాదాబ్ (బి) బుమ్రా 2; నవాజ్ (సి) బుమ్రా (బి) పాండ్యా 4; హసన్ (సి) గిల్ (బి) జడేజా 12; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 2; రవూఫ్ (ఎల్బీ) (బి) జడేజా 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–41, 2–73, 3–155, 4–162, 5–166, 6–168, 7–171, 8–187, 9–187, 10–191. బౌలింగ్: బుమ్రా 7–1–19–2, సిరాజ్ 8–0–50–2, పాండ్యా 6–0–34–2, కుల్దీప్ 10–0–35–2, జడేజా 9.5–0–38–2, శార్దుల్ 2–0–12–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) షాహిన్ 86; గిల్ (సి) షాదాబ్ (బి) షాహిన్ 16; కోహ్లి (సి) నవాజ్ (బి) హసన్ అలీ 16; అయ్యర్ (నాటౌట్) 53; కేఎల్ రాహుల్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (30.3 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–23, 2–79, 3–156. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 6–0–36–2, హసన్ అలీ 6–0–34–1, నవాజ్ 8.3–0–47–0, రవూఫ్ 6–0–43–0, షాదాబ్ 4–0–31–0. -
7 సార్లూ జయకేతనం ఎగురవేసిన టీమిండియా
-
పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే
ప్రపంచక్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య చానాళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ జట్లు ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్ టోర్నీల్లో మాత్రమే టోర్నీల్లో మాత్రమే తలపడతున్నాయి. దీంతో ఇరు జట్ల అభిమానులు దాయాదుల పోరు ఎప్పుడు ఉంటుందా అని వెయ్యికళ్లుతో ఎదురు చూస్తుంటారు. అయితే మరోసారి చిరకాల ప్రత్యర్థిలు అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాయి. ఆసియాకప్-2023లో భాగంగా శనివారం(సెప్టెంబర్ 2)న దాయాదుల పోరు జరగనుంది. ఇక బ్లాక్‌బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టులోని ప్రమాదకర ఆటగాళ్లపై ఓ లూక్కేద్దాం. పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. పాకిస్తాన్.. వన్డే క్రికెట్లో వరల్డ్ నెం1 జట్టుగా కొనసాగుతోంది. టీ20, టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనచేయలేకపోతున్న పాకిస్తాన్.. వన్డేల్లో మాత్రం దుమ్మురేపుతుంది. పాక్ చివరగా ఆడిన 10 వన్డేల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాక్ జట్టులో చాలా మంది డేంజరేస్ ఆటగాళ్లు ఉన్నారు. మెన్ ఇన్ గ్రీన్ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్.. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్‌తో ప్రారంభమవుతోంది. వీరిద్దరి గత కొంత కాలంగా పాకిస్తాన్‌కు అద్భతమైన ఓపెనింగ్ అందిస్తున్నారు. ముఖ్యంగా ఇమామ్ ఉల్ హక్కు వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 63 మ్యాచ్‌లు ఆడిన ఇమామ్.. 50.68 సగటుతో 2889 పరుగులు చేశాడు. అదే విధంగా ఫఖర్ జమాన్‌కు టీమిండియాతో మ్యాచ్ అంటే పూనకలే. 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై అద్భుతమైన సెంచరీతో జమాన్ నిలిచాడు. 114 పరుగులు చేసి పాక్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరోసారి ఈ ఓపెనర్లద్దరూ చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. బాబర్ ఆజం, రిజ్వాన్.. పాకిస్తాన్ వరుసగా విజయాలు సాధిస్తుందంటే అందుకు కారణం ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, రిజ్వాన్. బాబర్ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం బాబర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆసియాకప్ తొలి మ్యాచ్‌లోనే ఆజం సెంచరీతో అదరగొట్టాడు. బాబర్ వన్డేల్లో నెం1 ఆటగాడిగా ఉన్నాడు. రిజ్వాన్ కూడా విధ్వంసకర ఆటగాడు. టీ20ల్లో పాక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే రిజ్వాన్.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. మిడిలార్డర్లో పాక్ జట్టుకు రిజ్వాన్ వెన్నుముక లాంటి వాడు. రిజ్వాన్ బ్యాటింగ్ పరంగా కాకుండా వికెట్ల వెనుక కూడా అద్బుతాలు సృష్టించగలడు. కాగా 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత బౌలర్లను వీరిద్దరూ ఒక ఆటఆడేసుకున్నారు. ఇక వీరిద్దరూ మరోసారి తమ బ్యాట్లకు పనిచెబితే పరుగులు వరద పారడం ఖాయం. ఇఫ్తికర్ అహ్మద్.. ఇఫ్తికర్ అహ్మద్.. ఈ మధ్యన పాకిస్తాన్ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ 32 ఏళ్ల ఆటగాడికి ఢిపెన్స్ ఆడ గలడు.. హిట్టింగ్ చేయగలడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు తన అద్భుత ఇన్నింగ్స్‌లతో ఇఫ్తికర్ అదుకుంటున్నాడు. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇఫ్తికర్ అహ్మద్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 71 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బాబర్, రిజ్వాన్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. అహ్మద్ హాఫ్ సెంచరీతో రాణించి తన జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ సాధించాడు. షాహీన్ అఫ్రిది.. పాకిస్తాన్‌కు బ్యాటింగ్ ఎంతో బలమో.. బౌలింగ్ కూడా అంతకుమించి. పాక్ బౌలింగ్ విభాగంలో ముందు వరుసలో ఉంటాడు 23 ఏళ్ల షాహీన్ షా అఫ్రిది. ఈ లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తన పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. షాహీన్ షా అఫ్రిది ఎదుర్కొనేందుకు నెట్స్‌లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌తో భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. ఇది చూస్తే మనకు అర్ధం అయిపోతుంది షాహీన్ ఎంత ప్రమాదకర బౌలరో. అఫ్రిది బౌలింగ్‌ను ఆడేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే పాక్‌తో మ్యాచ్‌కు రాహుల్ దూరం కావడంతో రోహిత్ అఫ్రిదిని ఎలా ఎదుర్కరొంటాడో వేచి చూడాలి. ఇక అఫ్రిదితో పాటు బ్యాటర్లకు చుక్కలు చూపించే మరో పేస్ సంచలనం నసీం షా. 20 ఏళ్ల నసీం షాకు.. గంటకు 145 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఇప్పటివరకు కేవలం 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నసీం షా.. 26 వికెట్లు సాధించాడు. అతడు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ కనీస ఒక్క వికెట్‌నైనా పడగొట్టాడు. వీరిద్దరితో పాటు హారీస్ రౌఫ్ కూడా పాక్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకుంటున్నాడు. వీరిముగ్గురు నిప్పులు చేరిగితే భారత బ్యాటర్లకు కష్టాలు తప్పవు. భారత్‌దే పై చేయి.. అయితే ఆసియాకప్‌లో మాత్రం పాకిస్తాన్‌పై భారత్‌దే పై చేయి. ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో భారత్-పాకిస్తాన్ ముఖాముఖి 13 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పాకిస్తాన్ 5 సార్లు గెలుపొందింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఓవరాల్‌గా ఆసియాకప్‌లో భారత్ 49 మ్యాచ్‌లు ఆడగా.. 31 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 16 సార్లు ఓటమి పాలైంది. అదే విధంగా పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో 26 విజయాలు, 18 ఓటములు నమోదు చేసింది. ఆసియాకప్‌లో భారత్ విజయ శాతం 65.62గా ఉంది. చదవండి: Asia Cup 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! భారత్‌కు కూడా సాధ్యం కాలేదు -
ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. ఏకంగా పాకిస్తాన్ కెప్టెన్‌గా! ఎవరీ అక్రమ్?
చైనా వేదికగా జరగనున్న ఆసియాక్రీడలకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఖాసిం అక్రమ్‌ను కెప్టెన్‌గా పాక్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. అయితే ఆక్టోబర్ నుంచి 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనుండడంతో ఆసియా క్రీడలకు తమ ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఖాసిం అక్రమ్‌తో పాటు అరాఫత్ మిన్హాస్, మీర్జా తాహిర్ బేగ్, సుఫియాన్ ముఖీమ్, రోహైల్ నజీర్, ఓమైర్ బిన్ యూసుఫ్,ముహమ్మద్ అఖ్లాక్లకు తొలి సారి పాకిస్తాన్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఈ జట్టులో ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, షానవాజ్ దహానీ,మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాదిర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఎవరీ అక్రమ్? ఇక ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండా ఏకంగా పాక్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఖాసిం అక్రమ్ గురుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 20 ఏళ్ల అక్రమ్‌కు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సెంట్రల్ పంజాబ్ జట్టు తరపున అక్రమ్ ఆడుతున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 27 వికెట్లతో పాటు 960 పరుగులు సాధించాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 45 మ్యాచ్‌లు ఆడిన అక్రమ్ 35.27 సగటుతో 1305 పరుగులు సాధించాడు. అక్రమ్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. అండర్-19 ప్రపంచకప్-2021-2022లో పాక్ జట్టు కెప్టెన్‌గా అక్రమే వ్యవహరించాడు. ఈ టోర్నీలో కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా అక్రమ్ అకట్టుకున్నాడు. అదే విధంగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 విజేతగా పాక్ నిలవడంలో కూడా అక్రమ్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్-ఏ జట్టు తరపున అక్రమ్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి జట్టు పగ్గాలు సెలక్టర్లు అప్పగించారు. పాకిస్థాన్ షాహీన్స్ జట్టు: ఖాసిమ్ అక్రమ్ (కెప్టెన్), ఒమైర్ బిన్ యూసుఫ్ (విసి), అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, అర్షద్ ఇక్బాల్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మీర్జా తాహిర్ బేగ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), రోహైల్ నజీర్ , షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖదీర్. నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: అబ్దుల్ వాహిద్ బంగల్జాయ్, మెహ్రాన్ ముంతాజ్, మొహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, ముబాసిర్ ఖాన్. చదవండి: Praggnanandhaa: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! -
భారత వ్యతిరేకతే రాజకీయ అస్త్రం
భారత్‌తో రెండుసార్లు యుద్ధం జరిగేందుకు ఓపికగా ఎదురుచూసిన, మిలిటరీ జనరళ్లతో కలిసి కుట్రలు పన్నిన జుల్ఫికర్ అలీ భుట్టో ఆ తరువాతి కాలంలో మన దాయాది పాకిస్థాన్ అధ్యక్షుడు అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పుడు 51 ఏళ్ల తరువాత ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి, జుల్ఫికర్ అలీ భుట్టో మనుమడు బిలావల్ భుట్టో జర్దారీ కూడా అచ్చం అలాంటి కుట్రలే పన్నుతున్నట్లుగా కనిపిస్తోంది. భారత ప్రధానిని ‘గుజరాత్ కసాయి’గా బిలావల్ విమర్శించినప్పటికీ అది సొంతింటి శక్తులపై ఎక్కుపెట్టిన అస్త్రంగానే చూడాలి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ, భుట్టో–జర్దారీల పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండూ కలిసి పాకిస్తాన్‌ను నడిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు... ఈ రెండు పార్టీలూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తగిన సంబంధాలు ఏర్పరచుకున్నాయి. కార్గిల్ యుద్ధంతో చెలరేగిన ఘర్షణపూర్వక వాతావరణాన్ని కొద్దిగానైనా తేలికపరిచేందుకు ఈ సంబంధాలు ఉపయోగపడతాయని ఆ రెండు పార్టీలూ భావిస్తూండవచ్చు. నరేంద్ర మోదీ బహూకరించిన తల పాగాతో నవాజ్ షరీఫ్ తన కుటుంబ వివాహంలో కనబడటం ప్రాచుర్యం పొందిన అంశమే. పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీమ్ మునీర్ ఈ మధ్యే పదవీచ్యుతుడైన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పట్ల సానుకూలత కలిగిన వాడని అటు అక్కడి కిందిస్థాయి అధికారులతోపాటు భారతీయ నిఘా వర్గాలూ భావిస్తున్నాయి. ఈ విషయాన్ని మునీర్ స్వయంగా ఖండించినప్పటికీ ఇమ్రాన్‌కు సంబంధించిన సెక్స్ టేపులు సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడం ఒక సందేశమనే అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా, షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కూలిపోయే స్థితిలో ఉందనీ తెలుసు. షాబాజ్‌ను తప్పించడం సైనిక జనరళ్లకు పెద్ద సమస్య కాకపోవచ్చు. కాకపోతే ఆయన స్థానంలో నవాజ్, ఆయన కుమార్తె మరియం పాక్ రాజకీయాల్లో ప్రధాన భూమిక వహించే ప్రమాదం ఉంటుంది. భారత్‌తో సంబంధాలు, భద్రత విషయాల్లో సైన్యంతో తగవు పెట్టుకున్నందుకే నవాజ్ పదవి పోయిందన్నది బహిరంగ రహస్యం. అలాగే మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్‌ను జైలుకు పంపించేందుకు నవాజ్ చేసిన ప్రయత్నాలను కూడా సైన్యం అంత సులువుగా క్షమించలేకపోతోంది. వీటన్నింటి సారాంశం ఒక్కటే... పాకిస్తాన్లో అధికారం తమ చెప్పుచేతుల్లో ఉండే వ్యక్తికి అందాలి. ఈ అవకాశాన్ని వాడుకునే లక్ష్యంతోనే బిలావల్ భుట్టో తన తాత జుల్ఫికర్ అలీ భుట్టో ఆడినట్లుగానే జాతీయవాదాన్ని తలకెత్తుకుంటున్నారు. తద్వారా సైన్యానికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. వెయ్యేళ్ల యుద్ధం? 1965 భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో భారత సేనలు లాహోర్‌కు కిలోమీటర్ల దూరంలో ఉండగా, జుల్ఫికర్ అలీ భుట్టో ఐరాస భద్రతా సమితిలో ఓ భారీ ప్రసంగం చేశారు. ‘‘భారత్‌తో వెయ్యేళ్ల యుద్ధం చేస్తాం’’ అని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ ప్రసంగం పాక్ ప్రజలను ఉత్తేజపరిచింది. పాక్ అప్పటికే ఓడి పోయిందనీ, భవిష్యత్తు గెలుపు కలనే మంత్రి రేడియో రూపంలో అందిస్తున్నారనీ పాపం ప్రజలకు తెలియరాలేదు. అయితే ప్రధానిగా జుల్ఫికర్ అలీ భుట్టో కొత్త అవతారం ఎత్తాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య వాదిగా మారినట్లు కనిపించడం ద్వారా ఆయన 1965, 1971 యుద్ధాల ఓటమిని ప్రజలు మరచిపోయేలా చేయగలిగారు. పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు ఉన్న అవకాశం కాస్తా 1958 నాటి మిలిటరీ కుట్రతో తుడిచిపెట్టుకుపోయింది. దీని వెనుక కూడా జుల్ఫికర్ హస్తముందని అంచనా. హుసేన్ సుహ్రావర్దీ (1956 – 57 ప్రధానమంత్రి) లాంటి తూర్పు పాకిస్తాన్ నేతలు ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకున్నారని జుల్ఫికర్ అప్పట్లో వాదించారు. రాజకీయ గందరగోళ పరిస్థితుల్లోనే విప్లవం పుట్టుకొచ్చిందనీ, అన్నిం టినీ చక్కదిద్దాల్సి వచ్చిందనీ మిలిటరీ కుట్రను సమర్థించుకున్నారు. 1965లో కశ్మీర్ విషయంలో భారత్‌తో యుద్ధానికి జనరల్ అయూబ్‌ను రెచ్చగొట్టింది కూడా జుల్ఫికరే. కోవర్టు దళాల ద్వారా భారత్‌పై దాడి చేస్తే అది సంప్రదాయ పద్ధతుల్లో తిప్పికొట్ట లేదని జనరల్ అయూబ్‌కు నూరిపోశారు. ‘‘అస్సాంలోని నాగాలు, లుషియాలను, పంజాబ్‌లోని సిక్కులనూ రెచ్చగొట్టి యుద్ధానికి దిగాలి’’ అని కూడా జుల్ఫికర్ చెప్పుకున్నారు. ఇది కాస్తా అయూబ్‌పై ప్రభావం చూపింది. అయితే యుద్ధంలో ఈ అంచనాలన్నీ తారు మారవడంతో జుల్ఫికర్ దీనివెనుక అమెరికా హస్తముందన్న కొత్త రాగం అందుకున్నారు. ఆ తరువాత 1966 ప్రాంతంలో జుల్ఫికర్ కుట్రలు బట్టబయలయ్యాయి. ఉద్యోగమూ పోయింది. జైల్లో బంధింపబడ్డారు. అయితే జైల్లో అష్టకష్టాలు పడ్డానని చెప్పుకోవడం జుల్ఫికర్ను ప్రజల దృష్టిలో హీరోను చేసింది. తూర్పు పాకిస్తాన్ సంక్షోభం మిలిటరీ ప్రభుత్వపు రీతులతో విసుగు చెందిన పాక్ ప్రజలు జుల్ఫికర్ రూపంలో ఓ హీరోను చూసుకున్నారు. అందుకే 1970లో జుల్ఫికర్ మావో టోపీ, గ్రీన్ జాకెట్‌తో ఎన్నికల్లో పోటీ చేశారు. ఇస్లాం, సోషలిజం రెండింటినీ కలగలిపి పాకిస్తాన్‌ను రక్షిస్తామని ప్రచారం చేశారు. ముల్లాలను సంతృప్తి పరిచేందుకుగానూ ఇస్లాం కోసం ‘జిహాద్’కు దిగుతామనీ, పాకిస్తాన్లో మాత్రమే కాకుండా... ప్రపంచ అంతటా ఇది సాగుతుందనీ నమ్మబలికారు. ‘‘భారత్‌లో ముస్లింల రక్తం చిందుతూంటే చేతులు కట్టుకుని ఉండం’’ అని ప్రకటించారు. ఫీల్డ్ మార్షల్ అయూబ్ స్థానంలో అప్పటికి ఏడాది క్రితమే జనరల్ యాహ్యాఖాన్ అత్యున్నత పదవిలోకి చేరారు. జనరల్ యాహ్యాఖాన్ కూడా ‘‘దేశం మళ్లీ ప్రజాస్వామ్యం పట్టాలెక్కడం చూడాలని కుతూహలంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే, తూర్పు పాకిస్తాన్లో జనాభా ఎక్కువ. అక్కడ ఎన్నికల్లో విజయం సాధించడం అధికారాన్ని మరింత దగ్గర చేస్తుంది. 1970లో షేఖ్ ముజిబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ ఏకంగా 160 సీట్లు సాధించగా, జుల్ఫికర్ పార్టీ 81 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ అధికారం కోల్పోయేందుకు జుల్ఫికర్ ఏమాత్రం అంగీకరించలేదు. సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందా మని ప్రతిపాదించారు. తద్వారా తాను పశ్చిమ పాకిస్తాన్ ప్రధానిగా కొనసాగవచ్చునని ఆశించారు. జనరల్ యాహ్యాఖాన్ ఈ వాదనను వ్యతిరేకించారు. జుల్ఫికర్ ప్రతిపాదనను అంగీకరిస్తే తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లకు అధికార పంపిణీ చేయాల్సి ఉంటుందని భావించారు. ముజీబ్‌కు అధికారాన్ని నిరాకరించడం ద్వారా జుల్ఫికర్ జనరల్ యాహ్యాఖాన్ ఆందోళనను నిజం చేశారు. తూర్పు పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగడం, భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు పెరగడంతో ముజీబ్ వ్యతిరేకి నూరుల్ అమీన్‌కు పగ్గాలు అప్పగించి, జుల్ఫికర్ను డిప్యూటీ ప్రధానిని చేశారు. పదమూడు రోజుల కాలానికి జల్ఫికర్ మిలిటరీ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ అధికారం చేపట్టారు. ఈ ముచ్చట ఎక్కువ కాలం నిలవకపోగా పాకిస్తాన్ రెండుగా చీలిపోయేందుకు కారణమైంది. ఇప్పుడు కూడా జుల్ఫికర్ తనను తాను రక్షకుడిగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ‘హిమాలయాల కంటే పొడవైన వాణ్ణి నేను’, ‘నాక్కొంచెం సమయం ఇవ్వండి’ అంటూ పాకిస్తాన్ ప్రజలతో గొప్పలుపోయారు. యుద్ధంలో ఓటమికి జనరల్ యాహ్యా ఖాన్ కారణమనీ, అతడి తాగుడు, తిరుగుబోతుతనం వల్లే భారత్‌తో ఓడామనీ ప్రచారంలో పెట్టారు. ఢాకా న్యాయవాది హుస్నా షేఖ్‌తో తన సొంత వ్యవహారాన్ని మాత్రం కప్పిపుచ్చారు. నెహ్రూ సోదరి విజయ లక్ష్మీ పండిట్ కుమార్తె రీటా దార్ పట్ల జుల్ఫికర్ చేసిన, ప్రజాబాహుళ్యంలోకి ఎక్కువగా రాని అసభ్య వ్యాఖ్యలను స్టాన్లీ వోల్పెర్ట్ గ్రంథస్తం చేశారు. జుల్ఫికర్ అలీ భుట్టో పిచ్చి చేష్టలు చాలానే ఉన్నాయి. జనరల్ జియా ఉల్ హక్‌ను విదేశీ అతిథుల ముందు ‘నా కోతి’ అని వ్యాఖ్యా నించి హేళన చేయడం వాటిల్లో ఒకటి. వీటి ఫలితమే ఆర్థి కంగా దేశం చితికిపోయిన సందర్భంలో ఆ ‘కోతి’ కాస్తా జుల్ఫికర్ను ఉరికొయ్య లకు వేలాడదీసేలా చేసింది. తన తాత మాదిరిగానే ఇప్పుడు బిలావల్ కూడా జాతీయవాదం, మిలిటరీ జనరళ్ల కృపా కటాక్షాల ఆధారంగా రాజకీయంగా పైమెట్టుకు ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యూహం వల్ల ఒరిగే ఒక ఫలితం ఏమిటంటే, పాకిస్తాన్ రాజకీయ యవనికపై మిలటరీ పట్టు మరింత బిగుసుకోవడం! వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ప్రింట్’ సౌజన్యంతో) -
వాట్ యాన్ ఎక్సలెంట్ రన్ ఛేజ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
వాట్ ఏ విన్.. వాట్ ఏ మాసివ్ ఫర్ఫామెన్స్.. కింగ్ కోహ్లీ కా కమాల్.. టీ ట్వంటీ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో భారత్ సెన్సేషనల్ విన్. ఇలా ఏ పదం వాడినా టీమిండియా ఘనతను వర్ణించడానికి సరిపోదేమో. అలాంటి విజయాన్ని సాధించింది టీమిండియా. 30 పరుగులకే టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ చివరి ఓవర్లో చివరి బంతికి దాయాది పాకిస్తాన్‌పై గెలుపును రుచి చూసింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి టోర్నీలో ఘనంగా బోణి కొట్టింది. తాజాగా ఈ ఘనవిజయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. (చదవండి: జపనీస్ భాష నేర్చుకుంటున్న ఎన్టీఆర్.. యువతులతో సరదా సంభాషణ..!) జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్: నరాలు తెగే ఉత్కంఠకు తెరతీసిన మ్యాచ్‌పై తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం స్పందించాడు. టీమిండియా ఘనతను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. ఈ మేరకు టీమిండియా ప్రదర్శను పొగుడుతూ ట్వీట్ చేశారు. ' చాలా అద్భుతమైన ఛేదన , కోహ్లీ అండ్ టీం సంచలన విజయం సాధించింది. నేను మ్యాచ్‌ను చాలా ఎంజాయ్ చేశాను' అంటూ ట్వీట్ చేశారు. జూనియర్ సైతం టీమిండియా ఘనతకు ఫిదా అయ్యారు. అది కాస్తా వైరలవడంతో అభిమానులు రీ ట్వీట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. What an excellent run chase !! Kohli and the team pulled off a sensational win ! Enjoyed it. — Jr NTR (@tarak9999) October 23, 2022 -
'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్'
టీ20 ప్రపంచకప్-2022 తొలి రౌండ్(క్వాలిఫియర్స్) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్-12 అర్హత సాధించగా.. గ్రూప్-బి భవితవ్యం శుక్రవారం తేలిపోనుంది. ఇక శనివారం(ఆక్టోబర్-22) నుంచి సూపర్-12 సమరం ప్రారంభం కానుంది. సూపర్-12లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సిడ్నీ వేదికగా తలపడనున్నాయి అనంతరం ఆదివారం(ఆక్టోబర్ 23)న మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్, భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి గతేడాది ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇక భారత్-పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022లో టాప్ రన్ స్కోరర్‌గా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలుస్తాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా బాబర్ ఆజం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన పాకిస్తాన్-న్యూజిలాండ్-బంగ్లాదేశ్ ట్రై సిరీస్‌లో బాబర్ అదరగొట్టాడు. క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. "పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. అతడు ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చూస్తుంటే మనం ఎంత కూల్‌గా ఉంటామో.. బాబర్ బ్యాటింగ్‌ను చూసిన కూడా అదే భావన కలుగుతుంది. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ నిలిచే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: 'అతడు ఒంటి చేత్తో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందిస్తాడు' -
Asia Cup 2022: దాయాదుల పోరుకు రంగం సిద్దం.. విజయం ఎవరిది?
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. యుద్ధానికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా ఉండే వాతావరణం. ఎవరితో ఓడినా ఇక్కడ మాత్రం ఓడరాదనే కసి... నాటి ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకుపోవడం, మాటల తూటాలు, టీవీ చానళ్లలో తీవ్ర చర్చ... ఇదంతా ఒకప్పటి మాట! గత కొంత కాలంగా చూస్తే ఆటగాళ్లు మధ్య స్నేహాలు, ప్రత్యేక పలకరింతలు, పరస్పర అభినందనలు, అవతలి జట్టు అభిమానులతో లెక్క లేనన్ని సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లకు సిద్ధమైపోతూ ఈ పోరు తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా చూసి మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదని అనుకోవద్దు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆసక్తిలో మాత్రం మార్పు రాలేదు. స్టేడియంలో అన్ని టికెట్లు 10 రోజుల ముందే అమ్ముడుపోయాయి. టోర్నీలో ఇతర మ్యాచ్‌లకు 400 దిర్హమ్లు (సుమారు రూ.8,700)కు అమ్ముడుపోయే టికెట్ ఈ మ్యాచ్ కోసం 6000 దిర్హమ్లు (సుమారు 1 లక్షా 30 వేలు) పలికింది. నాలుగు గంటల వినోదం అంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు భారత్ నుంచి దుబాయ్‌కు ప్రత్యేక విమానాల్లో ట్రిప్‌లు కూడా ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో వారాంతంలో భారత్, పాక్ అభిమానులకు ఆనందం పంచనుంది. దుబాయ్: ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేకపోవడంతో ఇలా అరుదుగా తలపడుతుండటమే భారత్, పాక్ మధ్య మ్యాచ్‌పై ఆసక్తికి కారణమవుతోంది. గత ఏడాది ప్రపంచకప్‌లో అభిమానుల అంచనాలకు విరుద్ధంగా ఇదే వేదికపై పాకిస్తాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడింది. సుమారు పది నెలల విరామం తర్వాత ఇప్పుడు రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి. స్వల్ప మార్పులు మినహా దాదాపు ఆ ఆటగాళ్లే మరోసారి బరిలోకి దిగబోతున్నారు. ఈసారి టీమిండియా పైచేయి సాధిస్తుందా లేక పాక్ ఫలితాన్ని పునరావృతం చేస్తుందా చూడాలి. కోహ్లిపైనే దృష్టి... టి20ల్లో గత కొంత కాలంగా భారత్ ఫామ్ చూస్తే తుది జట్టు విషయంలో పెద్దగా అనూహ్య మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే విశ్రాంతి తర్వాత సీనియర్లు పునరాగమనం చేయడంతో ఇటీవల రాణించిన కుర్రాళ్లను కూడా తప్పనిసరిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనుండగా, మూడో స్థానంలో కోహ్లి సత్తా చాటాల్సి ఉంది. రోహిత్ తనదైన శైలిలో చెలరేగితే పాక్‌కు కష్టాలు తప్పవు. ఇటీవల జింబాబ్వేతో వన్డేల్లో బరిలోకి దిగిన రాహుల్‌కు ఐపీఎల్ తర్వాత ఇదే తొలి టి20 మ్యాచ్. సుదీర్ఘ కాలంగా ఆశించిన స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లి తన స్థాయికి తగిన ప్రదర్శన చేయాల్సి ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్, పంత్, పాండ్యా దూకుడైన బ్యాటింగ్ భారత్‌కు అదనపు బలం. ఏడో స్థానంలో జడేజా కూడా సత్తా చాటితే తిరుగుండదు. గాయంతో బుమ్రా, హర్షల్ దూరం కావడంతో సీనియర్‌గా భువనేశ్వర్‌పై అదనపు భారం ఉంది. అర్‡్షదీప్‌కు కూడా చోటు ఖాయం. లెగ్‌స్పిన్నర్ చహల్ ప్రత్యర్థిని కట్టి పడేయగలడు. రెండో స్పిన్నర్‌గా అశ్విన్, బిష్ణోయ్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉండగా...పిచ్ పరిస్థితి బట్టి వీరిద్దరు కాకుండా మూడో పేసర్ అవేశ్‌కు కూడా చాన్స్ దక్కవచ్చు. ఎలా చూసినా పాకిస్తాన్‌తో పోలిస్తే మన జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. వారిద్దరు మినహా... పాకిస్తాన్ బ్యాటింగ్ భారం ప్రధానంగా ఇద్దరిపైనే ఆధారపడి ఉంది. కెప్టెన్ బాబర్ ఆజమ్, కీపర్ రిజ్వాన్ చాలా కాలంగా ఓపెనర్లుగా జట్టుకు మంచి విజయాలు అందించారు. గత ఏడాది కూడా భారత్‌పై విజయంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. అయితే 152 లక్ష్యంతోనే బరిలోకి దిగిన నాటి వ్యూహం ఈసారి పని చేయకపోవచ్చు. వీరిద్దరు కూడా విధ్వంసకర బ్యాటర్లు కాదు. సాధారణ స్ట్రయిక్‌రేట్‌తో మాత్రమే ఆడగలరు. మూడో స్థానంలో ఫఖర్ జమాన్ కాస్త దూకుడైన ప్లేయర్. ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లు ఎవరూ అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా నిరూపించుకున్నది లేదు. ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్, నవాజ్ ఏమాత్రం ప్రభావం చూపగలరో చెప్పలేం. షాహిన్ అఫ్రిది దూరం కావడం పాక్ బౌలింగ్‌ను బలహీనంగా మార్చింది. రవూఫ్‌తో పాటు నసీమ్ షా, హస్నైన్లపైనే జట్టు ఆధారపడుతోంది. ఉస్మాన్ ఖదీర్ రూపంలో రెగ్యులర్ స్పిన్నర్ టీమ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లికిది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ కానుంది. మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20) కనీసం 100 మ్యాచ్‌ల చొప్పున ఆడిన రెండో క్రికెటర్‌గా (న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్ తర్వాత) అతను ఘనత సాధిస్తాడు. భారత్, పాక్ మధ్య 9 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఆరింటిలో భారత్, రెండింటిలో పాక్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’ అయింది. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. ప్రాక్టీస్ షురూ చేసిన కింగ్ కోహ్లి!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆసియాకప్ కోసం తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గరువారం ముంబైలోని బికేసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కోహ్లి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న కోహ్లి తిరిగి ఆసియా కప్‌లో బరిలోకి దిగననున్నాడు. ఇక కోహ్లి గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతడు అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి మూడేళ్లు దాటుతోంది. ఈ ఏడాది నాలుగు అంతర్జాతీయ టీ20 ఆడిన కోహ్లి 81 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కోహ్లి ఆసియా కప్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా ఆసియా కప్‌లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న తల పడనుంది. అయితే పాకిస్తాన్‌పై కింగ్ కోహ్లికి తిరుగులేని రికార్డు ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత బ్యాటర్లు అంతా విఫలమైనా.. కోహ్లి మాత్రం అర్ధసెంచరీతో మెరిశాడు. మరోసారి పాక్‌పై కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా శ్రీలంక-ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం భారత్, పాక్ జట్లు తమ జట్లను ప్రకటించాయి. మిగితా జట్లను కూడా ఆయా దేశ క్రికెట్ బోర్డులు ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఆసియకప్కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్. స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ ఆసియకప్కు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ మరియు ఉస్మాన్ ఖదీర్ #ViratKohli has started the practice for #AsiaCup 2022 at BKC Complex Mumbai.pic.twitter.com/KkhgGWGYti — Lakshya Lark (@lakshyalark) August 11, 2022 చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి.. -
వరల్డ్‌కప్‌కు ముందే భారత్- పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
భారత అభిమానులకు గుడ్ న్యూస్. దాయాదుల పోరుకు మరో సారి రంగం సిద్దం కానుంది. ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో భారత్- పాకిస్తాన్‌లు మరో సారి తలపడనున్నాయి. దీనికి శ్రీలంక వేదిక కానుంది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఈ నిర్ణయాన్ని వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్యక్షుడిగా జైషా ఉన్నారు. ఇక ఈ సారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. అదే విధంగా ఈ టోర్నమెంట్లో మొత్తం 6 జట్లు పాల్గోనున్నాయి. కాగా 2020లో జరగాల్సిన ఆసియాకప్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆసియాకప్ చివరసారిగా 2018లో జరిగింది. 2018 ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక భారత్-పాక్ దేశాల నెలకొన్న ఉద్రిక్తల మధ్య ఇప్పటిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు. దీంతో క్రికెట్ అభిమానులు ఐసీసీ ఈవెంట్లు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్లోను ఇరు దేశాలు తలపడనున్నాయి. చదవండి: Yastika Bhatia: 'క్రికెట్లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా' -
శెభాష్ అమ్మాయిలు.. పాక్‌పై భారత్ ఘన విజయం(ఫోటోలు)
-
ప్రపంచకప్‌లో భారత్ బోణి.. పాకిస్తాన్‌కు చుక్కలు..
Ind W Vs Pak W 2022 World Cup: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో భారత్ బోణి కొట్టింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కాగా పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. ఇక 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్(30) తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ మూడు వికెట్లు పడగొట్టగా, గోస్వామి, స్నేహ్ రానా చెరో రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాదించింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. ఇక 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను పూజా వస్త్రాకర్(67),స్నేహ్ రానా(53) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ మిథాలీ, హర్మన్ ప్రీత్, షఫాలీ వర్మ నిరాశపరిచాడు. పాక్ బౌలర్లలో నిదా ధార్,సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బేగ్, ఆమీన్ ఒక్కో వికెట్ సాధించారు. ఇక ఈమ్యాచ్‌లో 67 పరుగులతో అద్భుతంగా రాణించిన పూజా వస్త్రాకర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మార్చి10న తలపడనుంది. చదవండి: Shane Warne: శవపరీక్షకు వార్న్ మృతదేహం.. బోరుమన్న దిగ్గజం కుమారుడు -
భారత్ లో మాపై ప్రేమ ఎక్కువ: అఫ్రిది
కోల్ కతా: పాకిస్తాన్ లో ఉన్నప్పటి కంటే భారత్ లోనే ఎక్కువ సంతోషంగా ఉంటానని ఆ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది చెప్పాడు. భారత్ తో క్రికెట్ అనగానే ఎప్పుడూ చాలా ఎంజాయ్ చేస్తానని మీడియా సమావేశంలో అఫ్రిది అన్నాడు. ఇక్కడి వారు తమ జట్టు భారత్ కు వచ్చిన ప్రతిసారి చాలా ప్రేమగా, ఆప్యాయతతో మమ్మల్ని ఆహ్వానిస్తారని తెలిపాడు. నిజం చెప్పాలంటే స్వదేశంలో కూడా తమకు అభిమానుల నుంచి ఇంత ప్రేమ దొరకదని వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో భారత్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందని, టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మార్చి 19న భారత్ తో జరగనున్న మ్యాచ్ తమకు కీలకమని పాక్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. పాక్, భారత్ దేశాలను క్రికెట్ చాలా దగ్గర చేసిందని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఆట, రాజకీయం అనేది రెండు భిన్నమైన అంశాలని చెప్పాడు. తొలి మ్యాచ్ ఎప్పిటికీ చాలా ముఖ్యమైనదని, అందుకే బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ నుంచే తమ పోరు ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు. రెండో మ్యాచ్ భారత్ తో ఉందని, ఆ మ్యాచ్ కూడా తమకు చాలా టఫ్ అని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ లో పాక్ ఓటమి గురించి ప్రస్తావిస్తూ... విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ పోరాటం తమ జట్టు నుంచి విజయాన్ని లాగేసుకున్నాయని తెలిపాడు. తమ బౌలర్ల ప్రదర్శనపై పూర్తి నమ్మకం ఉందని పాక్ కెప్టెన్ అఫ్రిది అంటున్నాడు.