Asia Cup 2022 to Be Held in Sri Lanka in August-September - Sakshi
Sakshi News home page

IND vs PAK: వరల్డ్‌కప్‌కు ముందే భారత్‌- పాక్‌ మ్యాచ్‌.. ఎప్పుడంటే..?

Published Sat, Mar 19 2022 4:32 PM | Last Updated on Sat, Mar 19 2022 5:31 PM

Asia Cup 2022 to be held in Sri Lanka in August September - Sakshi

భారత అభిమానులకు గుడ్‌ న్యూస్‌. దాయాదుల పోరుకు మరో సారి రంగం సిద్దం కానుంది. ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో భారత్‌- పాకిస్తాన్‌లు మరో సారి తలపడనున్నాయి.  దీనికి శ్రీలంక వేదిక కానుంది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు జరగనుంది. ఈ నిర్ణయాన్ని వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్యక్షుడిగా జైషా ఉన్నారు.

ఇక ఈ సారి ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. అదే విధంగా ఈ టోర్నమెంట్‌లో మొత్తం 6 జట్లు పాల్గోనున్నాయి. కాగా 2020లో జరగాల్సిన ఆసియాకప్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.  ఆసియాకప్‌ చివరసారిగా 2018లో జరిగింది. 2018 ఆసియా కప్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. 

ఇక భారత్‌-పాక్‌ దేశాల నెలకొన్న ఉద్రిక్తల మధ్య ఇప్పటిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు. దీంతో క్రికెట్‌ అభిమానులు  ఐసీసీ ఈవెంట్‌లు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోను ఇరు దేశాలు తలపడనున్నాయి.

చదవండి: Yastika Bhatia: 'క్రికెట్‌లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement