చైనా వేదికగా జరగనున్న ఆసియాక్రీడలకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఖాసిం అక్రమ్‌ను కెప్టెన్‌గా పాక్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఏడాది ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8 వరకు జరగనున్నాయి. అయితే ఆక్టోబర్ నుంచి 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనుండడంతో ఆసియా క్రీడలకు తమ ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఖాసిం అక్రమ్‌తో పాటు అరాఫత్ మిన్హాస్, మీర్జా తాహిర్ బేగ్, సుఫియాన్ ముఖీమ్, రోహైల్ నజీర్, ఓమైర్ బిన్ యూసుఫ్,ముహమ్మద్ అఖ్లాక్‌లకు తొలి సారి పాకిస్తాన్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఈ జట్టులో ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, షానవాజ్ దహానీ,మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాదిర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.
ఎవరీ అక్రమ్?
ఇక ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండా ఏకంగా పాక్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ఖాసిం అక్రమ్ గురుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 20 ఏళ్ల అక్రమ్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సెంట్రల్ పంజాబ్ జట్టు తరపున అక్రమ్ ఆడుతున్నాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 27 వికెట్లతో పాటు 960 పరుగులు సాధించాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో 45 మ్యాచ్‌లు ఆడిన అక్రమ్ 35.27 సగటుతో 1305 పరుగులు సాధించాడు. అక్రమ్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి.
అండర్-19 ప్రపంచకప్-2021-2022లో పాక్ జట్టు కెప్టెన్‌గా అక్రమే వ్యవహరించాడు. ఈ టోర్నీలో కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా అక్రమ్ అకట్టుకున్నాడు. అదే విధంగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 విజేతగా పాక్ నిలవడంలో కూడా అక్రమ్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్-ఏ జట్టు తరపున అక్రమ్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి జట్టు పగ్గాలు సెలక్టర్లు అప్పగించారు.
పాకిస్థాన్ షాహీన్స్ జట్టు: ఖాసిమ్ అక్రమ్ (కెప్టెన్), ఒమైర్ బిన్ యూసుఫ్ (విసి), అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, అర్షద్ ఇక్బాల్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మీర్జా తాహిర్ బేగ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), రోహైల్ నజీర్ , షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖదీర్.
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: అబ్దుల్ వాహిద్ బంగల్జాయ్, మెహ్రాన్ ముంతాజ్, మొహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, ముబాసిర్ ఖాన్.
చదవండి: Praggnanandhaa: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు!
Comments
Please login to add a commentAdd a comment