టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి రుజువు చేసింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆదివారం న్యూయర్క్ వేదికగా పాక్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఈ విజయంతో టీమిండియా సూపర్-8కు అడుగు దూరంలో నిలవగా.. పాకిస్తాన్ మాత్రం వరుస ఓటములతో తమ సూపర్-8 ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇక భారత విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైన పాండ్యా.. బౌలింగ్‌లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. హార్దిక్ తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాండ్యా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌పై టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హార్దిక్ రికార్డులకెక్కాడు.
పాక్‌పై ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా.. 13 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు.
అదే విధంగా ఓవరాల్‌గా పాక్-భారత్ మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కూడా పాండ్యానే కావడం గమనార్హం. పాండ్యా తర్వాత ఉమర్ గుల్(11), భువనేశ్వర్ కుమార్(11) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment