
ఐసీసీ టీ20 ర్యాకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సత్తాచాటాడు. టీ20ల్లో నెం1 ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా అవతరించాడు. రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగతో అగ్రస్థానాన్ని హార్దిక్ పంచుకున్నాడు.
ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్-2024లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పాండ్యా.. భారత్ రెండో సారి టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లోనూ పాండ్యా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ప్రోటీస్ విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేసి భారత్‌ను విజేతగా నిలిపాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో పాండ్యా 6 ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లోనూ 11 వికెట్లు పడగొట్టాడు.
ఇక టీ20 వరల్డ్‌కప్ సమయంలో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానంలో ఉన్న అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఏకంగా ఆరో స్థానానికి పడిపోయాడు. అదే విధంగా ఈ పొట్టి ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ ఒక్క స్ధానం ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా నాలుగు ఐదు స్ధానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment