
ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అతడిని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అని పొగుడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2024 ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఫామ్‌లో లేని ఆటగాడికి ఛాన్స్ ఎందుకు ఇచ్చారని సెలక్టర్లపై కూడా చాలా మంది మాజీలు ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటకి హార్దిక్ తన ఆటతోనే సమాధానమిచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండ్ షోతో హార్దిక్ అదరగొట్టాడు.
కీలకమైన ఫైనల్లో సైతం పాండ్యా సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో తన మార్క్ చూపించే అవకాశం పెద్దగా రాకపోయినప్పటికి బౌలింగ్‌లో మాత్రం దుమ్ములేపాడు. ఓటమి తప్పదనుకున్న పాండ్యా మ్యాజిక్ చేశాడు. 17 ఓవర్ వేసిన పాండ్యా.. చేలరేగి ఆడుతున్న క్లాసెన్‌ను అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు.
క్లాసెన్ వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అనంతరం ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను కూడా రోహిత్.. హార్దిక్ పాండ్యాకే అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టకున్నాడు. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.
భారత్ విజయం సాధించగానే పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జెండా పట్టుకుని స్టేడియం మొత్తం పాండ్యా తిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడి 144 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పాండ్యాపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.