సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బౌలర్లు అద్భతంగా పోరాడినప్పటికి బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రోటీస్‌తో జరిగిన తొలి టీ20లో విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు రెండో మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయారు.
మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ శాంసన్ తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అభిషేక్ శ్మ (4), సూర్యకుమార్ యాదవ్ (4) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27) పర్వాలేదన్పించారు.
పాండ్యా సెల్పిష్ ఇన్నింగ్స్.. !
ఇక భారత ఇన్నింగ్స్ 8 ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు స్కోర్ 120 పరుగుల మార్క్ దాటేలా చేశాడు. ఓ వైపు వికెట్లు క్రమం తప్పకుండా పడతుండడంతో హార్దిక్ సింగిల్స్ తీస్తూ భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.
ఆఖరి మూడు ఓవర్లలో హిట్టింగ్‌కు హార్దిక్ ప్రయత్నించాడు. కానీ ఆఖరిలో కూడా పాండ్యా ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో స్ట్రైక్ తన వద్దే అంటిపెట్టుకున్న పాండ్యా కేవలం బౌండరీ మాత్రమే బాదాడు. ఓవరాల్‌గా 45 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. స్ట్రైక్ రేట్ 86.67తో 39 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఓ సిక్స్ మాత్రమే ఉన్నాయి.
అయితే స్లో స్ట్రైక్ రేట్‌తో ఆడిన పాండ్యాపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేరాడు. పాండ్యాను ఉద్దేశించి అతడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ జట్టు అవసరాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడని అలీ ఆరోపించాడు.
"పాండ్యా సార్ ఆజేయంగా నిలిచి 45 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అతడు ఈ ఇన్నింగ్స్ జట్టు కోసం కాదు తన కోసం ఆడాడు. హార్దిక్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ సెల్ఫిష్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన తీరు క్షమించరానిది.
అర్ష్‌దీప్ సింగ్ సిక్సర్ కొట్టినప్పటికి అతడు హార్దిక్ స్ట్రైక్ కూడా ఇవ్వలేదు. భారత్ చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నప్పటికి పాండ్యా సింగిల్స్‌ను తిరష్కరించాడు. స్ట్రైక్ తనవద్దే అంటిపెట్టుకుని ఏమి సాధించాడు. అతడి కంటే అక్షర్ పటేల్ ఎంతో బెటర్. పాండ్యా కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 27 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు" అని అలీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి?
Comments
Please login to add a commentAdd a comment