ప్రపంచక్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య చానాళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ జట్లు ఐసీసీ ఈవెంట్‌లు, ఆసియాకప్ టోర్నీల్లో మాత్రమే టోర్నీల్లో మాత్రమే తలపడతున్నాయి.
దీంతో ఇరు జట్ల అభిమానులు దాయాదుల పోరు ఎప్పుడు ఉంటుందా అని వెయ్యికళ్లుతో ఎదురు చూస్తుంటారు. అయితే మరోసారి చిరకాల ప్రత్యర్థిలు అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాయి. ఆసియాకప్-2023లో భాగంగా శనివారం(సెప్టెంబర్ 2)న దాయాదుల పోరు జరగనుంది. ఇక బ్లాక్‌బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టులోని ప్రమాదకర ఆటగాళ్లపై ఓ లూక్కేద్దాం.
పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు..
పాకిస్తాన్.. వన్డే క్రికెట్‌లో వరల్డ్ నెం1 జట్టుగా కొనసాగుతోంది. టీ20, టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనచేయలేకపోతున్న పాకిస్తాన్.. వన్డేల్లో మాత్రం దుమ్మురేపుతుంది. పాక్ చివరగా ఆడిన 10 వన్డేల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాక్ జట్టులో చాలా మంది డేంజరేస్ ఆటగాళ్లు ఉన్నారు. మెన్ ఇన్ గ్రీన్ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది.
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్..
పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్‌తో ప్రారంభమవుతోంది. వీరిద్దరి గత కొంత కాలంగా పాకిస్తాన్‌కు అద్భతమైన ఓపెనింగ్ అందిస్తున్నారు. ముఖ్యంగా ఇమామ్ ఉల్ హక్‌కు వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు 63 మ్యాచ్‌లు ఆడిన ఇమామ్.. 50.68 సగటుతో 2889 పరుగులు చేశాడు.
అదే విధంగా ఫఖర్ జమాన్‌కు టీమిండియాతో మ్యాచ్ అంటే పూనకలే. 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై అద్భుతమైన సెంచరీతో జమాన్ నిలిచాడు. 114 పరుగులు చేసి పాక్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరోసారి ఈ ఓపెనర్లద్దరూ చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.
బాబర్ ఆజం, రిజ్వాన్..
పాకిస్తాన్ వరుసగా విజయాలు సాధిస్తుందంటే అందుకు కారణం ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, రిజ్వాన్. బాబర్ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం బాబర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆసియాకప్ తొలి మ్యాచ్‌లోనే ఆజం సెంచరీతో అదరగొట్టాడు. బాబర్ వన్డేల్లో నెం1 ఆటగాడిగా ఉన్నాడు.
రిజ్వాన్ కూడా విధ్వంసకర ఆటగాడు. టీ20ల్లో పాక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే రిజ్వాన్.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. మిడిలార్డర్‌లో పాక్ జట్టుకు రిజ్వాన్ వెన్నుముక లాంటి వాడు. రిజ్వాన్ బ్యాటింగ్ పరంగా కాకుండా వికెట్ల వెనుక కూడా అద్బుతాలు సృష్టించగలడు. కాగా 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత బౌలర్లను వీరిద్దరూ ఒక ఆటఆడేసుకున్నారు. ఇక వీరిద్దరూ మరోసారి తమ బ్యాట్‌లకు పనిచెబితే పరుగులు వరద పారడం ఖాయం.
ఇఫ్తికర్ అహ్మద్..
ఇఫ్తికర్ అహ్మద్.. ఈ మధ్యన పాకిస్తాన్ క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ 32 ఏళ్ల ఆటగాడికి ఢిపెన్స్ ఆడ గలడు.. హిట్టింగ్ చేయగలడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు తన అద్భుత ఇన్నింగ్స్‌లతో ఇఫ్తికర్ అదుకుంటున్నాడు. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇఫ్తికర్ అహ్మద్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 71 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బాబర్, రిజ్వాన్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. అహ్మద్ హాఫ్ సెంచరీతో రాణించి తన జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ సాధించాడు.
షాహీన్ అఫ్రిది..
పాకిస్తాన్‌కు బ్యాటింగ్ ఎంతో బలమో.. బౌలింగ్ కూడా అంతకుమించి. పాక్ బౌలింగ్ విభాగంలో ముందు వరుసలో ఉంటాడు 23 ఏళ్ల షాహీన్ షా అఫ్రిది. ఈ లెఫ్ట్‌ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తన పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. షాహీన్ షా అఫ్రిది ఎదుర్కొనేందుకు నెట్స్‌లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌తో భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు.
ఇది చూస్తే మనకు అర్ధం అయిపోతుంది షాహీన్ ఎంత ప్రమాదకర బౌలరో. అఫ్రిది బౌలింగ్‌ను ఆడేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే పాక్‌తో మ్యాచ్‌కు రాహుల్ దూరం కావడంతో రోహిత్ అఫ్రిదిని ఎలా ఎదుర్కరొంటాడో వేచి చూడాలి. ఇక అఫ్రిదితో పాటు బ్యాటర్లకు చుక్కలు చూపించే మరో పేస్ సంచలనం నసీం షా. 20 ఏళ్ల నసీం షాకు.. గంటకు 145 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉంది.
ఇప్పటివరకు కేవలం 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన నసీం షా.. 26 వికెట్లు సాధించాడు. అతడు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ కనీస ఒక్క వికెట్‌నైనా పడగొట్టాడు. వీరిద్దరితో పాటు హారీస్ రౌఫ్ కూడా పాక్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకుంటున్నాడు. వీరిముగ్గురు నిప్పులు చేరిగితే భారత బ్యాటర్లకు కష్టాలు తప్పవు.
భారత్‌దే పై చేయి..
అయితే ఆసియాకప్‌లో మాత్రం పాకిస్తాన్‌పై భారత్‌దే పై చేయి. ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో భారత్-పాకిస్తాన్ ముఖాముఖి 13 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పాకిస్తాన్ 5 సార్లు గెలుపొందింది.
ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఓవరాల్‌గా ఆసియాకప్‌లో భారత్ 49 మ్యాచ్‌లు ఆడగా.. 31 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 16 సార్లు ఓటమి పాలైంది. అదే విధంగా పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో 26 విజయాలు, 18 ఓటములు నమోదు చేసింది. ఆసియాకప్‌లో భారత్ విజయ శాతం 65.62గా ఉంది.
చదవండి: Asia Cup 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! భారత్‌కు కూడా సాధ్యం కాలేదు
Comments
Please login to add a commentAdd a comment