
జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు యంగ్ టైగర్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'హ్యాపీ బర్త్ డే అమ్మలు' అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన అభిమానులు ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ కూడా సమయం కేటాయిస్తారు తారక్. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రణతితో కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. ఇవాళ ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా తారక్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా.. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్30 పేరు పెట్టారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment