
జూ.ఎన్టీఆర్ (Ntr) ప్రస్తుతం జపాన్ లో ఉన్నాడు. గతేడాది మన దగ్గర రిలీజైన దేవర (Devara Movie).. ఈ 28న జపాన్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదివరకే ప్రీమియర్స్ పడగా.. వాటికి తారక్ తోపాటు దర్శకుడు కొరటాల శివ కూడా హాజరవడం విశేషం.
సతీసమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య ప్రణతి పుట్టినరోజు (Birthday) వేడుకల్ని మంగళవారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలని షేర్ చేసుకోవడంతో పాటు క్యూట్ క్యాప్షన్ కూడా పెట్టాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)

'అమ్మలు.. హ్యాపీ బర్త్ డే' అని తారక్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. దీనికి నెటిజన్ల లైకులు కొట్టేస్తున్నారు. 2011లో తారక్-ప్రణతికి పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
సినిమాల విషయానికొస్తే జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన‍్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. తర్వాత షెడ్యూల్ బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య)