Chiranjeevi Will Attend For NTR 30 Movie Launch On 23rd March - Sakshi
Sakshi News home page

NTR 30 Movie:'ఎన్టీఆర్ 30' మూవీ లాంఛ్.. ఆయనొస్తే మాత్రం పూనకాలే!

Published Fri, Mar 17 2023 7:50 PM | Last Updated on Fri, Mar 17 2023 10:01 PM

Chiranjeevi Will Attend For NTR 30 Movie launch On 23rd March - Sakshi

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్  నటిస్తున్న మూవీ  ఎన్టీఆర్ 3. ఈ చిత్రం ఓపెనింగ్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఈ మూవీ లాంచింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఓపెనింగ్ సమయంలో కొరటాల టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. అలాగే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎవరు ఊహించని గెస్ట్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే.  అమెరికా నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కంటే ముందే ఎన్టీఆర్ ఇండియా తిరిగివచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్-కొరటాల మూవీ ఓపెనింగ్ ఈనెలలో వుంటుందనే వార్తలపై నమ్మకం కుదిరింది. అసలు ఫిబ్రవరిలోనే ఈ సినిమాను లాంఛ్‌ చేయాలనుకున్నారు. అయితే తారకరత్న చనిపోవటం.. ఆతర్వాత ఎన్టీఆర్ అమెరికా వెళ్లటంతో ఎన్టీఆర్ 30 మూవీ వాయిదా పడింది. 

ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఆచార్యతో కొరటాల భారీ ఫ్లాప్‌ను ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ 30తో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ పాన్ వరల్డ్ హిట్ కావటంతో.. కొరటాల కూడా ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీ రెడీ చేశాడు. సముద్రం బ్యాక డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం కొరటాల ఇప్పటికే తన టీమ్‌తో కలిసి  హైదరాబాద్‌లో సముద్రం సెట్, ఓ దీవి సెట్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు.  

పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో తలపడేందుకు విలన్‌గా బాలీవుడ్ నటుడిని ఫిక్స్ చేశారు. ప్రభాస్‌ మూవీలో ఆదిపురుష్‌ లంకేశ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌ను ఎన్టీఆర్ 30 లో విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ సినిమాకి ఒప్పించినట్లు తెలుస్తోంది.  

విలన్‌గా సైఫ్ అలీఖాన్!

మార్చి 23న జరిగే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ ప్రోగ్రామ్‌ సైఫ్ అలీఖాన్ వస్తాడనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జోరుగా టాక్ నడుస్తోంది.  ఇక విలన్‌గా సైఫ్‌ అలీఖాన్ అధికారిక ప్రకటన కూడా ఆరోజే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మార్చి 23న జరగబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూవీ ఓపెనింగ్‌కి  ఊహించని గెస్ట్‌ కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

చిరంజీవికి ఆహ్వానం!

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిందనేది  ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. ఆచార్య తర్వాత చిరు, కొరటాల మధ్య దూరం పెరిగిందనేది ఇండస్ట్రీ టాక్. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఇన్ డైరెక్ట్‌గా కొరటాలపై కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కి చిరంజీవిని ఆహ్వానిస్తే... కచ్చితంగా వస్తారనే మాట వినిపిస్తోంది. కొరటాల సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ కోసమే కాకుండా జాన్వీకపూర్‌ ఎంట్రీ ఇవ్వనుండడంతో చిరంజీవి వస్తాడనే టాక్ నడుస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి,రామ్ చరణ్‌ రానున్నారట. ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ కాబట్టి .. తారక్ తో పాటే సందడి చేస్తాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మార్చి 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement