
షాకింగ్ న్యూస్ చెప్పిన నెహ్రా
బెంగళూరు: టీమిండియా వెటరన్ ఆటగాడు అశిష్ నెహ్రా పిడుగులాంటి వార్త చెప్పాడు. చిన్నస్వామి స్టేడియంలో నెహ్రా మీడియాతో మాట్లాడాడు. తాను సోషల్ మీడియాలో లేనని, తనకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్ లలో ఖాతాలు కూడా లేవన్నాడు. తాను ఇప్పటికీ పాత నోకియా మొబైల్ వాడుతున్నట్లు చెప్పగా.. ఆశ్చర్యపోవడం విలేకరుల పని అయింది. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఏం జరుగుతుందన్న వాటితో తనకు సంబంధం లేదన్నాడు. తనకు ఏం తోచినా అదే విషయాన్ని నిర్మొహమాటంగా మీడియాతో, ఇతర కార్యక్రమాల్లో చెప్పడం నెహ్రాకు కొత్తేమీ కాదు.
ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముందురోజు భారత ఆటగాళ్ల ముఖాలు మార్ఫింగ్ వివాదం గురించి ఎలా స్పందిస్తారని నెహ్రాను విలేకరులు అడిగారు. అందుకు నెహ్రా స్పందిస్తూ.. మీరు రాంగ్ పర్సన్ ను ఈ ప్రశ్న అడుగుతున్నారని, ఎందుకంటే సోషల్ మీడియాలో తనకు ఖాతాలు లేవని వివరించాడు. ఇంకా చెప్పాలంటే న్యూస్ పేపర్స్ కూడా చదవనన్నాడు. అయితే బంగ్లా జట్టు మాత్రం ఈ ఫార్మాట్లో రాణిస్తుందని పేర్కొన్నాడు. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం నాడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
నెహ్రా వ్యవహారంపై బీసీసీఐ కూడా స్పందించింది. వీరేంద్రసెహ్వాగ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, ఎలాగోలా మీరైనా నెహ్రాను సోషల్ మీడియాలోకి తీసుకురాగలరా అని ఓ ప్రశ్న వేసింది. దానికి వీరూ స్పందిస్తూ.. తనకు వీలైనంత వరకు ప్రయత్నిస్తానని ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చాడు. ఈ రెండు ట్వీట్లకు స్పందిస్తూ నెటిజన్లు ట్వీట్లతో వెల్లువెత్తించారు.
Dear @virendersehwag pa, can you please get Nehra ji on social media ?https://t.co/3SsWb5hj0h
— BCCI (@BCCI) March 22, 2016
@BCCI I will try my best .
— Virender Sehwag (@virendersehwag) March 22, 2016