Jasprit Bumrah Can Replace Virat Kohli As India Captain In T20Is: టీ20 ప్రపంచకప్- 2021 తర్వాత భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ ,కెఎల్ రాహుల్, రిషబ్ పంత్.ల్లో ఒకరు భాద్యతలు స్వీకరించనున్నారనే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా టీ20ల్లో తదుపరి భారత కెప్టెన్‌గా.. కొత్త పేరును తెరపైకి తీసుకువచ్చాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు టీ20 కెప్టెన్ భాద్యతలు స్వీకరించే అర్హతలు ఉన్నట్లు నెహ్రా తెలిపాడు.
"రోహిత్ శర్మతో పాటు, రిషబ్ పంత్ ,కేఎల్ రాహుల్ పేర్లును టీమిండియా తదుపరి కెప్టెన్‌గా వింటున్నాము. పంత్ భారత జట్టుతో ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు. కొన్ని సార్లు జట్టు నుంచి కూడా తొలగించబడ్డాడు. ఆదేవిధంగా మయాంక్ అగర్వాల్ ఫామ్ లేమి కారణం రాహుల్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కింది. అయితే బుమ్రా మాత్రం అన్ని ఫార్మాట్లలో తుది జట్టులో ఉంటున్నాడు.పేసర్లు కెప్టెన్లగా ఉండకూడదని ఎక్కడా వ్రాయలేదు"అని నెహ్రా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: MS Dhoni:ఆ జట్టులో కోహ్లికి నో ఛాన్స్.. కెప్టెన్‌గా మరోసారి ధోని
Comments
Please login to add a commentAdd a comment