ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు. టీ20ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. రేపు (ఆగస్ట్ 18) ఐర్లాండ్‌తో జరుగబోయే తొలి టీ20తో బుమ్రా ఈ ఘనత సాధించనున్నాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ భారత టీ20 జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించగా.. రేపటి మ్యాచ్‌తో బుమ్రా టీమిండియా 11వ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, బుమ్రా గతంలో భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా భారత కెప్టెన్‌గా తొలిసారి పగ్గాలు చేపట్టాడు.
ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బుమ్రా నేతృత్వంలోని భారత టీ20 జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా టీమిండియా రేపు తొలి టీ20 ఆడనుంది. దాదాపు 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్‌లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. బుమ్రాకు డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. ఐపీఎల్-2023 స్టార్లు రింకూ సింగ్, జితేశ్ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టిన శివమ్ దూబే జట్టులో చేరాడు. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. రెగ్యులర్ టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చారు. ఈ పర్యటనలో భారత్ ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు ఆడనుంది, మూడు మ్యాచ్‌లకు డబ్లిన్‌లోని ది విలేజ్ మైదానం వేదిక కానుంది.
ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment