Ricky Ponting Picks Two Indians In World T20I Top-5 List, Check Here Names - Sakshi
Sakshi News home page

రోహిత్‌, కోహ్లి కాదు.. వరల్డ్‌ టాప్‌-5 టీ20 ఆటగాళ్లు వీరే!

Published Tue, Sep 6 2022 9:07 AM | Last Updated on Tue, Sep 6 2022 10:01 AM

Ricky Ponting Picks Two Indians In World T20I Top 5 List - Sakshi

Ricky Ponting Picks Two Indians In World T20I Top 5 List: ఆస్ట్రేలియా వేదికగా జరగన్న టీ20 ప్రపంచకప్‌-2022కు సమయం దగ్గర పడతుండడంతో ఆయా జట్లు తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ మెగా ఈవెంట్‌కు ముందు ధ్వైపాక్షిక సిరీస్‌లతో జట్లు బీజీ బీజీగా గడపనునున్నాయి. ఇక భారత విషయానికి వస్తే..  ప్రపంచకప్ ముందు ప్రస్తుత జరుగుతున్న ఆసియాకప్‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లు ఆడనుంది.

కాగా 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు భారత్‌ ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవలేదు. కాబట్టి ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో గెలిచి భారత్‌కు టైటిల్‌ అందించాలని రోహిత్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. 'ఐసీసీ రివ్యూ' షో పాల్గొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌కు ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది.

 ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్‌లో టాప్‌- ఫైవ్ ప్లేయర్‌ల పేర్లు చెప్పమని ఆడగగా.. పాంటింగ్‌ తన మొదటి ఎంపికగా భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఎంచుకున్నాడు. అదే విధంగా మిగితా నాలుగు స్ధానాల్లో టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, పాకిస్తాన్‌ సారథి బాబర్‌ ఆజాం, ఆఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను ఎంపిక చేశాడు.
చదవండి: Asia Cup 2022 IND VS SL Super 4 Match: పంత్‌, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement