Want to win a World Cup one or two or three Says KL Rahul: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియా శుక్రవారం(నవంబర్5)న కీలక స్కాట్లాండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. తాను జట్టులో ఉండగా టీమిండియా ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించాలని రాహుల్ ఆకాంక్షించాడు. రాహుల్ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే రాహుల్ కోరిక ఈ ఏడాది ప్రపంచకప్‌లో నెరవేరే అవకాశం లేదు. ఎందుకంటే టీమిండియా ఇప్పటికే సెమిస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
కాగా భారత జట్టుకు భవిష్యత్తు నాయకులలో ఒకరిగా పేరుపొందిన రాహుల్ గతంలో 2019లో వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. అయితే సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. టీమిండియా ఆ మ్యాచ్‌ను గెలవలేకపోయినందుకు తాను ఎంత బాధపడ్డాడో అతడు చాలా ఇంటర్వ్యూల్లో తెలిపాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రపంచకప్ గెలవాలనే తన కోరిక గురించి రాహుల్ వెల్లడించాడు.
"2011లో భారత్ సాధించిన ప్రపంచకప్ విజయాన్ని నేను చూశాను. అప్పుడే నా దేశం కోసం ప్రపంచ కప్ గెలవాలని, గెలిచిన భారత జట్టులో నేను భాగమై చరిత్ర సృష్టించాలని నిర్ణయించుకున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో రాహుల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment