
యువీ తర్వాత కేఎల్ రాహుల్‌దే ఆ ఘనత..
T20 world Cup 2021: Team India Big Win KL Rahul Fastest 50 Details: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో భారత క్రికెటర్‌గా... ఓవరాల్‌గా నాలుగో ఆటగాడిగా నిలిచాడు. 18 బంతుల్లో అర్ధశతకం బాది ఈ ఘనత సాధించాడు.
ఇప్పటికీ యువీ పేరు మీదే
అంతకుముందు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అత్యంత తక్కువ బంతుల్లో ఈ ఫీట్ నమోదు చేసిన క్రికెటర్‌గా ఇప్పటికీ యువీ పేరు మీదే ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. డర్బన్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
►యువరాజ్ సింగ్- 2007లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ
►స్టీఫెన్ మైబర్గ్- 2014లో ఐర్లాండ్‌పై- 17 బంతుల్లో
►గ్లెన్ మాక్స్‌వెల్- 2014లో పాకిస్తాన్‌పై- 18 బంతుల్లో
►కేఎల్ రాహుల్-2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్‌పై 18 బంతుల్లో అర్ధ సెంచరీ.
టీమిండియా అద్భుత విజయం
దుబాయ్ వేదికగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది. కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ(19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా... రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కోహ్లి(2), సూర్యకుమార్ యాదవ్(6) అజేయంగా నిలిచారు.
చదవండి: KL RAHUL: నేను జట్టులో ఉండాలి.. భారత్ ప్రపంచకప్ గెలవాలి