
పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ (36 బంతుల్లో 101 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో సరికొత్త రికార్డును సృష్టించాడు. 35 బంతుల్లోనే శతకాన్ని బాది తమ దేశానికే చెందిన రిచర్డ్ లెవీ (న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో 100) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు.
మిల్లర్‌తో పాటు హషీమ్ ఆమ్లా (51 బంతుల్లో 85; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన రెండో టి20లో సఫారీలు 83 పరుగులతో గెలుపొంది 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ సైఫుద్దీన్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదిన మిల్లర్... తను ఆడిన చివరి 15 బంతుల్లోనే 58 పరుగుల్ని పిండుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 141 పరుగులకు కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment