
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా లహోర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 50 పరుగుల తేడాతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ మాత్రం తన విరోచిత పోరాటంతో అందరి మనసులను గెలుచుకున్నాడు.
363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే మిల్లర్ క్రీజులోకి వచ్చినప్పటికి ప్రోటీస్ స్కోర్ 167/4 గా ఉంది. అప్పటికే మ్యాచ్ సఫారీల చేజారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోవడానికి దక్షిణాఫ్రికా 128 బంతుల్లో 196 పరుగులు చేయాల్సి ఉండేది.
ఈ సమయంలో మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. అప్పటివరకు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్న కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు క్రమం తప్పకుండా వికెట్ కోల్పోతున్నప్పటికి మిల్లర్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. వరుస క్రమంలో బౌండరీలు బాదుతూ ఆఖరి బంతికి తన 6వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
మిల్లర్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా సౌతాఫ్రికా భారీ ఓటమి నుంచి తప్పించుకుంది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మిల్లర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
సెహ్వాగ్ రికార్డు బద్దలు..
👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా మిల్లర్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో సెహ్వాగ్ ఇంగ్లండ్‌పై 77 బంతుల్లో సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 67 బంతుల్లోనే శతక్కొట్టిన మిల్లర్..సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.
👉అదేవిధంగా ఐసీసీ వన్డే నాకౌట్ మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా మిల్లర్ రికార్డులకెక్కాడు. 2023 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాపై మిల్లర్ మూడు అంకెల స్కోర్‌ను సాధించాడు.
👉ఐసీసీ వన్డే టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌లలో సెంచరీ చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా మిల్లర్ నిలిచాడు. మిల్లర్ 35 ఏళ్ల 268 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(36 సంవత్సరాల 95 రోజులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.
చదవండి: Temba Bavuma: ఆ నలుగురు వల్లే ఈ ఓటమి.. కానీ అతడు మాత్రం అద్బుతం
Comments
Please login to add a commentAdd a comment