Courtesy: IPL
KL Rahul Likely to Say Good Bye to Punjab Kings: ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన పంజాబ్ కింగ్స్‌కు మరో గట్టి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రస్తుత సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించడం లేదని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ క్రిక్ బజ్ తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది.
త్వరలో జరగనున్న మెగా వేలంలోకి వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు రాహుల్ సంప్రదించినట్లు సమాచారం. అయితే రిటేన్ పాలసీ ప్రకారం ప్రతీ జట్టు ముగ్గురు ప్లేయర్స్‌ను రిటేన్ చేసుకునే హక్కు ఫ్రాంచైజీకి ఉంటుంది. అయితే బ్యాట్స్‌మన్‌గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి.. కెప్టెన్‌గా ఆ జట్టుకు టైటిల్ అందించకపోవడంపై రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వినికిడి.
కాగా బీసీసీఐ తదుపరి సీజన్ కోసం రిటేన్ పాలసీ మార్గదర్శకాలను ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లలో రాహుల్ 626 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్ టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా బబుల్‌లో చేరాడు. అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
చదవండి: Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్.. నా భార్యను వదిలేయండి!
Comments
Please login to add a commentAdd a comment