
Aaron Finch announces arrival of a baby girl: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తండ్రయ్యాడు. అతడి భార్య అమీ ఫించ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాపాయికి ఎస్తేర్ కేట్ ఫించ్‌గా నామకరణం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్న ఆరోన్ ఫించ్.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించాడు.
‘‘ఎస్తేర్ కేట్ ఫించ్.. ఈ అందమైన ప్రపంచంలోకి నీకు స్వాగతం. మా చిన్నారి రాకుమారి నిన్న సాయంత్రం 4 గంటల 58 నిమిషాల సమయంలో జన్మించింది. తను 3.54 కిలోల బరువు ఉంది. అమీ, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని భార్యాబిడ్డలతో దిగిన ఫొటోలను ఆరోన్ ఫించ్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
చదవండి: హింట్ ఇచ్చావుగా కోహ్లి; ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట!
ఇక కెరీర్ విషయానికొస్తే.. గాయాలతో సతమవుతున్న ఆరోన్ ఫించ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌లో మోకాలి గాయం కారణంగా వన్డే సిరీస్ మిస్సయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు. మోకాలికి చికిత్స చేయించుకుంటున్న అతడు.. అంతా సవ్యంగా సాగితే అక్టోబరులో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌నకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment