టీ20 వరల్డ్‌కప్-2022 తొలి సెమీఫైనల్లో రేపు (నవంబర్ 9) న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే ఈ సమరంలో ఇరు జట్లు కత్తులు దూసుకోనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
గ్రూప్-1లో అగ్రస్థానంతో న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకోగా.. అదృష్టం కలిసి రావడంతో గ్రూప్-2 నుంచి పాకిస్తాన్ రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది.
రెండో సెమీస్‌లో భారత్.. ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుండటంతో పాక్-కివీస్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలన్న ఆతృత భారతీయ అభిమానుల్లో పెరిగింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచి, ఇంగ్లండ్‌పై టీమిండియా గెలిస్తే.. ఫైనల్లో దాయదాల రసవత్తర సమరాన్ని వీక్షించవచ్చన్నదే టీమిండియా ఫ్యాన్స్ ఆకాంక్ష.
ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతుంది. టీమిండియా ఫ్యాన్స్ అయితే పాక్ తప్పక గెలిచి, ఫైనల్లో తమతో తలపడాలని ఆశపడుతున్నారు. బలాబలాలు, రికార్డులతో సంబంధం లేకుండా పాకే గెలవాలని గట్టిగా కోరుకుంటున్నారు.
ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయో ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటివరకు కివీస్-పాక్‌ల మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. పాక్ 17 మ్యాచ్‌ల్లో, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20 వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు 6 సందర్భాల్లో ఎదురెదురు పడగా.. పాక్ 4 సార్లు, కివీస్ 2 సార్లు విజయం సాధించాయి. గత 5 టీ20ల్లో పాక్ 4 మ్యాచ్‌ల్లో గెలువగా.. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది.
మరోవైపు వన్డే, టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌ల్లో పాక్‌కు న్యూజిలాండ్ చేతుల్లో ఓటమన్నదే లేదు. ఈ రెండు జట్లు వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో మూడుసార్లు సెమీఫైనల్స్‌లో తలపడగా.. అన్నింటిలో పాకిస్థానే విజయం సాధించింది.
1992 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం, 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో విజయం, 2007 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ లెక్కన టీ20ల్లో న్యూజిలాండ్‌పై పాక్ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది.
చదవండి: కెప్టెన్‌గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా
Comments
Please login to add a commentAdd a comment