ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్ తుది దశకు వచ్చేసింది. ఇంకా ఐదు మ్యాచ్‌లు ముగిస్తే లీగ్ దశ ముగుస్తుంది. లీగ్ దశలో టాప్-4లో ఉన్న జట్లు ప్లే ఆఫ్‌కు చేరతాయి. కాగా, ఐపీఎల్ తాజా సీజన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఐపీఎల్‌లో 51వ మ్యాచ్ ముగిసే సరికి 748 సిక్సర్లతో ఆల్‌టైమ్ రికార్డు లిఖించబడింది. అంతకుముందు 2012 సీజన్‌లో 732 సిక్సర్లు నమోదు కాగా, తాజాగా ఆ రికార్డు సవరించబడింది. ఈ సీజన్‌లో చెన్నై అత్యధికంగా 116 సిక్స్‌లు బాదగా సన్‌రైజర్స్ 62 సిక్సర్లతో చివరి స్థానంలో ఉంది.
ఇక ఆటగాళ్ల పరంగా లోకేశ్ రాహుల్(కింగ్స్ పంజాబ్) 32 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, రిషబ్ పంత్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) 31 సిక‍్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిలియర్స్(ఆర్సీబీ) 30 సిక్సర్లతో మూడో స్థానంలో నిలవగా, ఎంఎస్ ధోని(సీఎస్‌కే), అంబటి రాయుడు(సీఎస్‌కే)లు 29 సిక్సర్లతో సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు. క్రిస్ గేల్(కింగ్స్ పంజాబ్) 27 సిక్సర్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment