ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా సోమవారం ఇక్కడ హోల్కర్ క్రికెట్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది.
ఇప‍్పటివరకూ కింగ్స్ పంజాబ్ 11 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌ల్లో గెలుపొంది మూడో స్థానంలో ఉంది. మరొకవైపు ఆర్సీబీ 11 మ్యాచ్‌లకు గాను 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి ఏడో స్థానంలో ఉంది. ఇది ఆర్సీబీకి కీలక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఓటమి పాలైతే మాత్రం ప్లే ఆఫ్‌కు దారులు మూసుకుపోయినట్లే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, కింగ్స్ పంజాబ్ రెండు మార్పులు చేసింది. బరిందర్ శ్రాన్, ముజిబ్ ఉర్ రహ్మన్‌లను తప్పించింది. వారి స్థానాల్లో స్టోయినిస్, అంకిత్ రాజ్‌పుత్‌లను జట్టులోకి తీసుకుంది.
తుది జట్లు
కింగ్స్ పంజాబ్
అశ్విన్(కెప్టెన్), కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, అరోన్ ఫించ్, స్టోయినిస్, అక్షర్ పటేల్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, అంకిత్ రాజ్‌పుత్
ఆర్సీబీ
విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థీవ్ పటేల్, మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, గ్రాండ్ హోమ్, టిమ్ సౌతీ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, చాహల్
Comments
Please login to add a commentAdd a comment