
బర్మింగ్‌హామ్: బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌కప్ వేదికలో బంగ్లాదేశ్ తరఫున ఐదు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ ఐదు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని, దినేశ్ కార్తీక్, మహ్మద్ షమీల వికెట్లను ముస్తాఫిజుర్ సాధించాడు. దాంతో ఒక వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన రెండో బంగ్లా బౌలర్‌గా నిలిచాడు.
ఈ వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ హసన్ ఐదు వికెట్లు సాధించగా, తాజాగా ముస్తాఫిజుర్ ఐదు వికెట్లతో రాణించాడు. 2011 వరల్డ్‌కప్‌లో షఫిల్ ఇస్లామ్ బంగ్లా తరఫున నాలుగు వికెట్లు సాధించాడు. ఇదే ఈ వరల్డ్‌కప్ ముందు వరకూ బంగ్లా తరఫున ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన కాగా, దాన్ని షకీబుల్, ముస్తాఫిజుర్‌లు బ్రేక్ చేశారు. అది కూడా ఈ వరల్డ్‌కప్‌లోనే సాధించడం విశేషం. భారత్‌పై మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసుకుని ఐదు వికెట్లు సాధించి 59 పరుగులు ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment