మష్రఫె మొర్తజా
బర్మింగ్‌హామ్ : టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ క్యాచ్ చేజార్చడం, భారీ భాగస్వామ్యాలు నమోదు కాకపోవడమే తమ కొంపముంచిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తజా అభిప్రాయపడ్డాడు. గెలుపు కోసం తాము సాయశక్తులా ప్రయత్నించామని, కానీ పరిస్థితులు అనుకూలించలేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘మా ప్రయత్నం బాగుంది. కానీ ఒక్క మంచి భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అదృష్టం కలిసిరాలేదు. పరిస్థితులు అనుకూలించలేదు. షకీబ్ అల్ హసన్, ముష్ఫిక్ రహీమ్ అద్భుతంగా ఆడారు. రోహిత్ క్యాచ్ చేజార్చడం నిరాశను మిగిల్చింది. కానీ మైదానంలో ఇవి సాధారణమే. మా తదుపరి మ్యాచ్(పాకిస్తాన్‌తో)కు సర్వశక్తులా పోరాడుతాం. అభిమానుల మద్దుతు అద్భుతం. గెలుపుతో టోర్నీని ముగిస్తాం’ అని మష్రఫె మొర్తజా ఆశాభావం వ్యక్తం చేశాడు.
రోహిత్ ఇన్నింగ్స్ 9 పరుగుల వద్దే ముగియాల్సింది. దురదృష్టం తమీమ్ చేతుల్లోంచి జారితే... అదృష్టం రోహిత్ బ్యాట్‌ను తాకింది. తమీమ్ క్యాచ్ మిస్ చేయడం. తదనంతరం అతను మూడంకెల స్కోరు దాకా చెలరేగడం జరిగిపోయాయి. ముస్తఫిజుర్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతిని డీప్ స్క్వేర్ లెగ్‌లో గాల్లోకి లేపాడు. తమీమ్ సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేయడంతో బతికిపోయిన హిట్‌మ్యాన్ శతక్కొట్టాడు. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై సాధించిన సెంచరీలు కూడా క్యాచ్ మిస్ అయ్యాకే సాధించినవేనని తెలిసిందే. (చదవండి: విజయం అదిరె...)
Comments
Please login to add a commentAdd a comment