సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ
మొహాలి : అఫ్గాన్ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యంత ప్రభావం చూపే ఆటగాడని ఆ జట్టు కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్.. రషీద్ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆకాశానికెత్తాడు. ‘రషీద్ స్థిరత్వం కలిగిన ఆటగాడు. గత సీజన్‌లో అతను మాతో కలిసి విజయవంతంగా రాణించాడు. అతని బలం రోజు రోజుకి.. టోర్నీటోర్నీకి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని టోర్నీల్లో ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే తన దేశం తరపున కూడా ఇరగదీస్తున్నాడు. మా గేమ్ ప్రణాళికలో అతను అత్యంత ముఖ్యమైన బౌలర్. మా ప్రణాళిక దగ్గట్టు వికెట్లు తీయడంలో అతను దిట్టా.’ అని ఈ యవక్రికెటర్‌ని ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు కొనియాడాడు.
ఇక విలియమ్సన్ కెప్టెన్సీపై స్పందిస్తూ.. ‘కేన్ విలియమ్సన్ అనుభవంగల సారథి. అతను అంతర్జాతీయ జట్టుకు సారథ్యం వహించాడు. అతనికి నాయకత్వంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడం తెలుసు. తొలుత కెప్టెన్‌కు తన వ్యక్తిత్వం, బలాలపై నమ్మకం ఉండాలి. విలియమ్సన్ అలానే కొనసాగుతున్నాడు. మేం కూడా అతన్ని ఆ విధంగానే ప్రోత్సహిస్తున్నామని’ టామ్ మూడీ తెలిపాడు.
17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రషీద్‌ఖాన్ అనతి కాలంలోనే ప్రపంచ అత్యత్తుమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఐసీసీ టీ20, వన్డే ర్యాంకుల్లో తొలి స్థానాన్ని సాధించాడు. 2019 ప్రపంచకప్ టోర్నీకి అఫ్గనిస్తాన్ అర్హత సాధించడంలో సారథిగా కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు.. తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈసీజన్‌లో వరుస విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment