
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది.ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో 77 స్ధానాలకు గానూ మొత్తంగా 330 ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. భారత్ నుంచి 214 ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇక ఈ వేలంలో నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గం, ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ జోస్యం చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ మిచిల్ స్టార్క్ మాత్రం భారీ ధరకు అమ్ముడుపోతాడని మూడీ అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాది వేలంలో స్టీవ్ స్మిత్‌ను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. కానీ మిచిల్ స్టార్క్‌పై మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అత్యధిక ధర కలిగి ఉన్న శామ్ కుర్రాన్(రూ.18.50) రికార్డును స్టార్క్ బ్రేక్ చేస్తాడు. స్టార్క్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోన్కర్లేదని ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2024 Auction Updates: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. జాక్‌పాట్ ఎవరికో?
Comments
Please login to add a commentAdd a comment