
'ఏబీ, కోహ్లిలను నిలువరిస్తాం'
హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్తో శనివారం జరుగనున్న మ్యాచ్లో విజయం సాధించడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ స్పష్టం చేశాడు. రాయల్స్ చాలెంజర్స్తో అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్లో తమ ఓటమికి విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్సే కారణమన్నాడు. ఆ ఇద్దర ఆటగాళ్ల విధ్వంసకర ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ పరాజయం చవిచూసిందన్నాడు. అయితే ఈసారి వారి ఆటలు సాగనివ్వమని మూడీ తెలిపాడు.
కోహ్లి, ఏబీలను నిలువరిస్తాం. అందుకు మా దగ్గర చాలా ప్రణాళికలున్నాయి. వాటిని కచ్చితంగా అమలు చేసి ఆ ఇద్దర్ని నియంత్రిస్తాం. గత బెంగళూరు పిచ్ కు, ఇక్కడి పిచ్ కు చాలా తేడా ఉంది. బ్యాటింగ్ కు అనుకూలించే బెంగళూరు పిచ్ పై వరల్డ్ క్లాస్ ఆటగాళ్లను నిలువరించలేకపోయాం. హైదరాబాద్ పిచ్ కు అందుకు భిన్నంగా ఉంటుంది. గ్రౌండ్ ఆకారంలో కూడా రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అది మా కలిసొచ్చే అవకాశం ఉంది' అని మూడీ పేర్కొన్నాడు. సన్ రైజర్స్ తో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి(75), డివిలియర్స్(82) విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ 45 పరుగుల తేడాతో ఓటమి చెందింది.