వార్నర్-టామ్ మూడీ(ఫైల్‌ఫోటో)
ఢిల్లీ: కెప్టెన్సీ పదవి నుంచి తప్పిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై డేవిడ్ వార్నర్ షాక్‌కు గురయ్యాడని ఆ జట్టు క్రికెట్ డైరక్టర్ టామ్ మూడీ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వార్నర్ ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాడన్నాడు. అతని ముఖంలో చాలా నిరాశ, అసంతృప్తి కనిపించిందని మూడీ తెలిపాడు. ‘ వార్నర్ మంచి క్రికెటర్.. కెప్టెన్ కూడా. అటువంటప్పుడు మేనేజ్‌మెంట్ నిర్ణయం షాక్ గురిచేస్తోంది. టీమ్‌గా గాడిలో పడటానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం తప్పితే వేరే మార్గం కనిపించలేదు.
వార్నర్‌కు ఉద్వాసన చెప్పడంతో అతనికి ఏమీ అర్థం కాలేదు. మాకున్న ప్రస్తుత విదేశీ ఆటగాళ్ల పరిమితిని బట్టి వార్నర్‌పై వేటు పడింది. బెయిర్ స్టో, విలియమ్సన్, రషీద్ ఖాన్, ఒక ఆల్‌రౌండర్ ఉండాలనేది మేనేజ్‌మెంట్ నిర్ణయం. బాగా ఎక్కువగా ఆలోచించిన తర్వాతే వార్నర్‌పై వేటు పడింది. విలియమ్సన్, బెయిర్‌స్టోల ఫామ్ బాగుంది. దాంతో వారిని తప్పించే ఉద్దేశం లేదు. ఇక్కడ వార్నర్ ఒక్కడే ప్రత్యామ్నాయం. ఇది మొత్తం టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయమే. ఫ్రాంచైజీ కోణంలో చూసినా, జట్టుగా చూసినా ఈ లాజిక్‌ను వార్నర్ అర్థం చేసుకుంటాడు. జట్టు ప‍్రయోజనాల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకోక తప్పలేదు’ అని చెప్పుకొచ్చాడు.
ఇక్కడ చదవండి: మ్యాచ్ గెలవడం కోసం క్రీడాస్పూర్తిని పక్కనబెట్టారు
వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment