‘గౌతం గంభీర్‌తో జాగ్రత్త’ | Concentrating Only on Gautam Gambhir Would Get Us Into Trouble, Says Katich | Sakshi
Sakshi News home page

‘గౌతం గంభీర్‌తో జాగ్రత్త’

Published Mon, Apr 16 2018 7:21 PM | Last Updated on Mon, Apr 16 2018 7:22 PM

Concentrating Only on Gautam Gambhir Would Get Us Into Trouble, Says  Katich - Sakshi

కోల్‌కతా: గతేడాది వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా చేసిన గౌతం గంభీర్‌.. ఈ ఏడాది సొంత జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో గంభీర్‌ను కేకేఆర్‌ వదిలేసుకోవడంతో అతన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తీసుకుంది. అదే సమయంలో గంభీర్‌ కెప్టెన్‌ బాధ్యతల్ని సైతం కట్టబెట్టింది. అయితే సోమవారం ఈడెన్‌ గార్డెన్‌లో కేకేఆర్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో గంభీర్‌ హైలైట్‌గా నిలవనున్నాడు. ఒకప్పటి కెప్టెన్‌ కెప్టెన్‌ ఇప్పుడు ప్రత్యర్థిగా తలపడటంతో గంభీర్‌ హాట్‌ టాపిక్‌ అయ్యాడు.

ఈ క్రమంలోనే కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కాటిచ్‌ మాట్లాడుతూ.. గంభీర్‌పైనే దృష్టి నిలపాలని జట్టు సభ్యులకు సూచించాడు. గంభీర్‌ను టార్గెట్‌ చేయకపోతే అతను కేకేఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయమని హెచ్చరించాడు. ‘ మా జట్టు(కేకేఆర్‌) గురించి గంభీర్‌కు బాగా తెలుసు. అందులోనూ ఈడెన్‌ వికెట్‌పై గంభీర్‌కు మంచి అవగాహనం ఉంది. కేకేఆర్‌ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో గంభీర్‌కు ఆడిన అనుభవం ఉంది. దాంతో అన్ని రకాలుగా కేకేఆర్‌ లోటుపాట్లు గురించి తెలిసిన గంభీర్‌ పక్కాప్రణాళికతో మాతో పోరుకు సిద్ధమవుతాడు. గంభీర్‌పై ఏదొక కోణంలో మాత్రమే దృష్టి సారిస్తే మనకే ముప్పు పొంచి ఉంటుంది. గంభీర్‌ జాగ్రత్త’అని కాటిచ్‌ హెచ్చరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement