ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతం గంభీర్.. 2012, 2014లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే తాజా సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గంభీర్‌ను వదులుకోవడంతో సొంత జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు తిరిగొచ్చాడు. అదే సమయంలో కెప్టెన్‌గా కూడా నియమించబడ్డాడు. కాగా, ఢిల్లీ వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల్ని నుంచి తప్పుకున్నాడు గౌతీ. ఈ క‍్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
దాంతో శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ పోరుకు సిద్ధమైంది. కాగా, తాజా మ్యాచ్‌కు గంభీర్‌ను ఢిల్లీ మేనేజ్‌మెంట్ పక్కన కూర్చోబెట్టింది. కనీసం తుది జట్టులో కూడా అవకాశం కల్పించలేదు. ఫలితంగా దాదాపు 8 ఏళ్ల తర్వాత గంభీర్ ఒక ఐపీఎల్ మ్యాచ్‌కు తొలిసారి దూరమయ్యాడు. 2010 ఐపీఎల్‌లో గంభీర్ చివరిసారి తుది జట్టులో చోటు కోల్పోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో గంభీర్ ఆడలేదు. ఇప్పుడు మరొకసారి జట్టుకు దూరమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment