ఢిల్లీ: ఐపీఎల్ తాజా సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ శివం మావి, ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ అవేశ్ ఖాన్‌లు మ్యాచ్ రిఫరీ మందలింపుకు గురయ్యారు. వీరిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వికెట్‌ను తీసిన క‍్రమంలో దురుసుగా ప్రవర్తించారు. ఇది ఐపీఎల్ నిబంధనావళి లెవల్-1కు వ్యతిరేకం కావడంతో వారిద్దర్నీ రిఫరీ హెచ్చరించాడు. వీరు తమ తప్పును ఒప్పుకోవడంతో రిఫరీ మందలింపుతో సరిపెట్టారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే..
శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే కోల్‌కతా పేసర్ శివం మావి బౌలింగ్‌లో ఢిల్లీ ఓపెనర్ కోలిన్ మున్రో ఔటయ్యాడు. ఆ సమయంలో మావి దూకుడుగా వ్యవహరించడంతో పాటు నిరర్ధకమైన పదమును ఉపయోగించాడు. ఆ తరువాత కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఆండ్రీ రస్సెల్ ఔటైనప్పుడు ఢిల్లీ బౌలర్ అవేశ్ ఖాన్ తనకు నోటి పనిచెప్పాడు. దాంతో పాటు చేతితో ఏవో సంజ్ఞలు చేస్తూ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దాంతో వారిని రిఫరీ పిలిచి మందలించారు.
Comments
Please login to add a commentAdd a comment