ఐపీఎల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
కాన్పుర్: గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య ఇక్కడ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఢిల్లీ జట్టులో రబడా స్ధానంలో బ్రాత్ వైట్ తీసుకోగా గుజరాత్ లయన్స్ ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది. నాకౌట్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న ఇరు జట్లు పరువు కోసం పోరాడుతున్నాయి. పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన గుజరాత్ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ముంబై చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకుని తిరిగి విజయాల బాట పట్టాలని ఢిల్లీ కృతనిశ్చయంతో ఉంది. ఈ సీజన్ లో ఇరుజట్లు ఓసారి తలపడగా ఢిల్లీ పై చేయి సాధించింది. ఈ ఓటమికి బదులు తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తోంది.
తుది జట్లు
ఢిల్లీ డేర్ డెవిల్స్: సంజూ శాంసన్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, అండర్సన్, శ్రేయస్ అయ్యర్, శ్యాముల్స్, బ్రాత్ వైట్, పాట్ కమ్మిన్స్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ,, జహీర్ ఖాన్ ( కెప్టెన్)
గుజరాత్ లయన్స్: డ్వాన్ స్మిత్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా( కెప్టెన్), ఫించ్, రవీంద్ర జడేజా, ఫాల్కనర్, దినేశ్ కార్తీక్, బసీల్ తంపి, అంకిత్ సోని, కులకర్ణి, ప్రదీప్ సంగ్వన్.