డీడీని కలిసిన టీఎన్జీవోస్ నేతలు
Published Tue, Aug 30 2016 12:52 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
హన్మకొండ అర్బన్ : నర్సంపేట ఎస్సీ హాస్టల్ వార్డెన్ మధును సస్పెండ్ చేసిన నేపథ్యంలో టీఎన్జీవోస్ నేతలు సోమవారం దళిత సంక్షేమ శాఖ డీడీ శంకర్‌ను హన్మకొండలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఆరోపణలు వచ్చిన నేపద్యంలో ఉద్యోగిపై ముందుగా సమగ్ర విచారణ చేయాలని అలా కాకుండా సస్పెండ్ చేయడంవల్ల వార్డెన్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. అంతేకాకుండా హాస్టళ్లకు సకాలంలో సరుకులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు సస్పెన్షన్ల విషయంలో ఉన్నతాధికారులు ఆలోచించి నిర్ణయిం తీసుకోవాలని కోరారు. డీడీని కలిసిన వారిలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, వార్డెన్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కృష్ణ, ఏఎస్‌డబ్ల్యూవోలు భవానీప్రసాద్, గట్టుమల్లు తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement