
ఇసుక డీడీలకు అధిక డిమాండ్
రూ.లక్షల్లో చేతులు మారుతున్న వైనం
చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు
ఏటూరునాగారం : లారీల్లో ఇసుక కావాలంటే డీడీ చెల్లించాలి. దీని కోసం వాహనదారులు అధిక డబ్బులు చెల్లించాల్సిందే. ఓ శాఖ అధికారుల కనుసన్నల్లో చేలామణి అవుతున్న అక్రమ దందా.. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లు, యజమానుల దత్తకే డీడీలు వచ్చి చేరుతారుు. లారీల్లో ఇసుక నింపాలంటే బినామీ పేర్లపై తొలుత వేలాది డీడీలను ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటున్నారు. డ్రైవర్లకు ఎలాంటి కష్టంగా లేకుండా చేస్తారు. కాకపోతే.. కొంత డబ్బు ఎక్కువ చెల్లించాలి.. అంతేకాదు.. తమ వద్ద డీడీలు తీసుకుంటే లారీల్లో ఇసుక కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా నింపేస్తారు. సీరియల్ నంబర్ కూడా వెంటనే లభిస్తుందనే ఆఫర్లను ప్రకటిస్తున్నారు. దీంతో డీడీలకు యమ డిమాండ్ పెరిగింది.
13.50క్యూబిక్ మీటర్లకు రూ.7,425..
13.50 క్యూబీక్ మీటర్ల ఇసుక లారీకి ప్రభుత్వం టీఎస్‌ఎండీసీ ద్వారా రూ. 7425 నిర్ణయించింది. అరుుతే, తాము ఆన్‌లైన్‌లో డీడీలు ఇస్తామని దళారులు రూ.10 వేల నుంచి రూ. 12 వేల వరకు అక్రమంగా విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్ వ్యాపారులతోపాటు ఏటూరు, తుపాకులగూడెం వద్ద ఏజెంట్లకు, ఇసుక క్వారీ నిర్వాహకులకు ఇందులో వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీడీల పేరిట రోజూ కనీసం రూ. 3లక్షల- రూ.6 లక్షల అక్రమ వ్యాపారం కొనసాగుతోందని ప్రచారం సాగుతోంది. డీడీ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. డీడీలను అధిక ధరలతో కొనుగోలు చేసి యజమానులు.. మార్కెట్‌తోపాటు లబ్ధిదారులు, భవన నిర్మాణదారులకు ఒక్కో లారీకి రూ.40- రూ.50 వేల వరకు విక్రరుుస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు.
పేరుకే ప్రభుత్వ క్వారీ అరుునా.. అంతా అక్రమ వ్యాపారమేనని కొందరు ఆరోపిస్తున్నారు. డీడీల దందా మొదలుకొని ఇసుక లారీలు, సీరియల్ రావడం.. అధికలోడు నింపడం.. ఒకేరాత్రి 100-200 లారీలను చెక్‌పోస్టు దాటించడం నిత్యకృత్యమైందంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే దళారులు ప్రభుత్వ క్వారీని అక్రమ క్వారీగా మార్చే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఏటూరు, తుపాకులగూడెం ఇసుక క్వారీ టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు ఆఫీసర్ తారకరత్నను సంప్రదించగా, డీడీల దందాతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది కాబట్టి అక్రమాలకు తావుండదన్నారు.