ఉపాధి కల‍్పన జేడీ ఇళ‍్లపై ఏసీబీ దాడులు
Published Sat, Jan 7 2017 11:07 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస‍్తులు కూడబెట్టారన‍్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత‍్వ ఉపాధి కల‍్పన, శిక్షణ శాఖ సంయుక‍్త సంచాలకుడు(జేడీ) గోపురం మునివెంకటరమణకు సంబంధించిన ఇంటిత సహా బంధువుల ఇళ‍్లపై ఏసీబీ అధికారులు శనివారం ఉదయం దాడులు నిర‍్వహిస‍్తున్నారు. అవినీతి నిరోధక శాఖ డైరెక‍్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ నేతృత‍్వంలో హైదరాబాద్, తిరుపతి, విజయవాడలోని మునివెంకటరమణ ఇంటితో సహా ఆయన బంధువులకు చెందిన ఇళ‍్లపై ఏడు చోట‍్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర‍్వహిస్తున్నారు. మునివెంకటరమణ ఇంటిలో భారీ ఎత్తున నగదు, బంగారు, పలు ఇళ‍్లు, భూములకు చెందిన పత్రాలు దోరికినట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున‍్నందున పూర్తి వివరాలు వెల‍్లడికాలేదు.
Advertisement
Advertisement