దివీస్ బాధితులకు దన్నుగా..
దివీస్ బాధితులకు దన్నుగా..
Published Fri, Nov 18 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
సర్కారు దౌర్జన్యాలపై సమరోన్ముఖంగా
22న జిల్లాకు రానున్న వైఎస్సార్ సీపీ అధినేత జగ¯ŒS
పర్యటనను విజయవంతం చేయాలన్న జిల్లా నేతలు
కాకినాడ :
దివీస్ పరిశ్రమ కారణంగా నిర్వాసితులయ్యే కోన ప్రాంత ప్రజలకు అండగా నిలిచి, ప్రభుత్వంపై పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఈ నెల 22న జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. దివీస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి జగ¯ŒSకు మద్దతుగా నిలవాలని కోరింది. వైఎస్సార్ సీపీ జిల్లా «అధ్యక్షుడు కురసాలకన్నబాబు అ««దl్యక్షతన శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్ల సమావేశం జరిగింది. కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం దివీస్ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ఇళ్లకిలోకి చొరబడి దాడులు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. వేలాది పేద కుటుంబాల జీవితాలను పణంగా పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం దివీస్ «కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తోందని, జనపక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీపై అభివృద్ధి నిరోధక శక్తిగా ముద్రవేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఎస్‌ఈజడ్ పేరుతో సేకరించిన పదివేల ఎకరాలుండగా కొత్తగా దివీస్ కోసం 650 ఎకరాలు సేకరించడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు.
మితిమీరుతున్న ‘దేశం’ అరాచకాలు
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తుని సహా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలు మితిమీరి పోతున్నాయని, ఇందుకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ చేస్తున్న ‘గడపగడపకూ వైఎస్సార్’కు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుంటే.. టీడీపీ జనచైతన్య యాత్రలు వెలవెల బోతున్నాయన్నారు. కలెక్టర్ అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ప్రోటోకాల్ విషయంలో 5 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న జగనన్న నేతృత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ దివీస్ బాధితులకు మనోధైర్యం కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ టీడీపీది ఆటవిక పాలనని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాస్తూ పోలీసురాజ్యాన్ని నడుపుతున్నారన్నారు.
జిల్లాలో రాక్షస పాలన
పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో అధికార పార్టీ రాక్షస పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజమండ్రి రూరల్æ కో ఆర్డినేటర్ గిరజాల బాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. మండపేట కో ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ మాట్లాడుతూ తమ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూ.2 కోట్లు అక్రమంగా వసూలు చేయడంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ అధికార పక్ష వేధింపులపై సమష్టిగా పోరాడాలన్నారు. రాజమండ్రి కౌన్సిల్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలంతా సైనికుల్లా పోరాడాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టి బత్తులు రాజాబాబు, అత్తిలి సీతారామస్వామి మాట్లాడుతూ జగ¯ŒSకు జిల్లా అంతటా మద్దతుగా నిలవాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS ని««దlులను దారి మళ్ళించడాన్ని సమావేశం తప్పుబట్టింది. పంచాయతీల్లో పన్నులను మూడింతలు పెంచాలన్న ప్రభుత్వ విధానాన్ని పునః సమీక్షించాలని కోరింది. వివిధ నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు పర్వత పూర్ణచంద్రప్రసాద్, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, ఆకుల వీర్రాజు, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, మోతుకూరి వెంకటేష్, వట్టికూటి రాజశేఖర్, పెయ్యల చిట్టిబాబు, ఏడిద చక్రం, పాలెపు ధర్మారావు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు వలవల బాబ్జీ, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు పెట్టా శ్రీనివాస్, అబ్దుల్ బషీరుద్దీన్, సిరిపురపు శ్రీనివాసరావు, జిల్లా అ«ధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కాకినాడ నగరకమిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబీ, అమలాపురం పట్టణ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Advertisement