divees issue
-
దివీస్ బాధితులకు మద్దతుగా 22న జగన్ పర్యటన
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బహిరంగ సభను జయప్రదం చేయండి తుని రూరల్ : దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు ఈనెల 22న తొండంగి మండలానికి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ మండల కన్వీనర్ పోతల రమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్‌తో కలసి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వల్లూరు, హంసవరం, వి.కొత్తూరు, డి.పోలవరం, చామవరం, రేఖవానిపాలెం, కె.ఒ.మల్లవరం, రాపాక, డి.పోలవరం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆ రోజు సాయంత్రం తొండంగి మండలం దానవాయపేట శివారు తాటియాకులపాలెం సమీపంలో బీచ్ రోడ్డువద్ద జగన్ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి జగన్ పర్యటనకు, దివీస్ వ్యతిరేక పోరాట బాధితులకు మద్దతుగా భారీగా తరలిరావాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలు రెండేళ్లు ఓపిక పట్టాలని, అధికార పార్టీ ఆగడాలకు కళ్లెం వేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. తప్పుడు కేసులు బనాయించినా భయపడొద్దని, కార్యకర్తలంతా మనో నిబ్బరంతో ముందుకుసాగాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండడంతో కొత్తపార్టీలను ప్రోత్సహించేందుకు తెరపైకి తెస్తున్నారన్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే మహిళలు నిలదీస్తున్నారని, నాయకులకు కట్టిన ఫ్లెక్సీలన్ని ఓట్లు కూడా టీడీపీకి రావన్నారు. గడపగడపకూ వైఎస్సార్‌లకు వెళ్తుంటే గ్రామీణులు సైతం ముఖ్యమంత్రిపైన, నాయకులపైన ధ్వజం ఎత్తుతున్నారన్నారు. ఎంపీపీ పల్లేటి నీరజ, వైస్ ఎంపీపీ పురుషోత్తం గంగాభవానీ, ఎంపీటీసీలు చేపల గున్నబ్బాయి, బోజంకి లక్ష్మి, డబ్బూరి నాగశివ, కర్రి నాగేశ్వరరావు, కోడి గంగతల్లి, పలివెల కుమారి, నాగలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ కుర్ర బాబ్జీ, మాజీ సర్పంచ్ అత్తి వెంకటరమణ, డాక్టర్ బొప్పన రాము, రెడ్డి దత్తుడు, చింతల వెంకటరమణ, అన్నంరెడ్డి వీర్రాఘవులు, డి.బెనర్జీ, బర్రే అప్పారావు పాల్గొన్నారు. అనంత ఉదయభాస్కర్ పిలుపు అడ్డతీగల : ఈనెల 22న జిల్లాలోని తొండంగి మండలం పంపాదిపేటలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్ రెడ్డి పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ పిలుపునిచ్చారు. 22 న మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి జగన్ చేరుకుని హైవే మీదగా పంపాదిపేటకు వెళ్లి అక్కడ దివీస్ ప్రభావిత గ్రామాల బాధితులతో సమావేశమౌతారన్నారు.పార్టీ యువజన విభాగం మండల బాధ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పర్యటనలో పాల్గొనాలని ఆయన కోరారు. -
అణచివేస్తే ఆగిపోతుందా బాబూ
లక్కింశెట్టి శ్రీనివాసరావు : రాష్ట్రంలో ప్రశాంతమైన జిల్లా అంటే తూర్పు గోదావరినే చెబుతుంటారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ జిల్లావాసులు చాలా మంచోళ్లని కూడా పొగడ్తలతో ముంచెత్తుతుంటారాయన. రాజకీయాల్లో సెంటిమెంట్‌గా కూడా ఈ జిల్లా పేరే చెబుతుంటారాయన. ఎన్నికల ముందు వరకు ఇవే చిలక పలుకులు పలికారు. ఇప్పుడేమో అరాచశక్తులున్న జిల్లాగా ముద్ర వేసేందుకు కూడా ఎక్కడా వెనుకాడటం లేదు. ఊ అంటే చాలు పెద్ద ఎత్తున పోలీసుల బలగాలతో నింపేస్తున్నారు ఆ బాబు. ఎవరి మద్ధతుతోనైతే అధికారంలోకి వచ్చానని ఆయన చెబుతుంటారో అదే వర్గాన్ని కఠినంగా అణచివేస్తున్నారు. తొమ్మిదేళ్లు అనుభవించి కోల్పోయిన పదవి కోసం ఎడాపెడా హామీలు గుప్పించేశారాయన. అధికారం కోసం తలపెట్టిన మహాపాదయాత్ర జిల్లాలో జరుగుతుండగానే రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి అనేక ఆశలు కల్పించారు. దశాబ్థాలుగా పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్లు అమలుచేసి తీరతానని ఆ వర్గాన్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. చంద్రబాబు ఇదే జిల్లాలో ఆ సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ డిమాండ్ కోసం ఆ సామాజిక వర్గం తలపెట్టిన ఎన్నో ఉద్యమాలకు ఈ జిల్లా వేదికైంది. అందుకే ఆ సామాజికవర్గంలో ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచే మొదలవుతుంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలుకు నోచుకోని చంద్రబాబు హామీపై ఇదే జిల్లా వేదికగా ఆ సామాజికవర్గం గొంతెత్తి అడుగుతోంది. అందుకే ఆ వర్గంపై చంద్రబాబు కక్షకట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారం కోసం అసలు హామీ ఇవ్వడమెందుకు, న్యాయమైన డిమాండ్‌ను అడుగుతుంటే నిర్బంధంతో మంది గొంతు నొక్కేయడమెందుకని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.ఆ సామాజికవర్గంలో పలువురు నేతలు ఉద్యమ బాటపట్టినా ఉద్యమనేతగా మాత్రం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఆ వర్గం నెత్తినపెట్టుకుంది, ఇప్పటికీ పెట్టుకుంటోంది కూడా. ఎవరి మాట వినరని, అనుకున్నది అనుకున్నట్టే ముక్కుసూటిగా చేసుకుపోయే ముద్రగడ వ్యవహారశైలి సహచరులు కూడా చాలా సందర్భాల్లో నచ్చకపోయి ఉండవచ్చు. అయినా కానీ అతని మాటకు ఆ వర్గం కట్టుబడే ఉంటుంది. అదే చంద్రబాబు సర్కార్‌కు కంటగింపుగా మారింది. ముద్రగడ ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగిరావాలా అనేదే ఆలోచిస్తున్నారు తప్పించి తాను హామీ ఇచ్చాను, అమలు చేసి తీరతాననే విషయాన్ని కార్యచరణలో చూపించి వారికి నచ్చజెప్సాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇతరులకు కూడా ఇబ్బందికరంగా తయారైంది.వారు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు, నీరుగార్చేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలు, వేధింపులు ఇతర వర్గాల్లో కూడా ఏవగింపును కలిగిస్తున్నాయి. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే అనుమతి అనే కుంటిసాకుతో భగ్నం చేయడం ద్వారా ప్రభుత్వం ఏమి సాధించిందంటే సమాధానమే దొరకదు. ఇక్కడ రావులపాలెంలో పాదయాత్రకు సిద్దమయ్యే సమయానికి మరోచోట చంద్రబాబు సర్కార్ ద్వారా చైర్మ¯ŒSగా నియమితులైన చలమలశెట్టి రామానుజయ్యతో సమాంతరంగా పాదయాత్ర చేపట్టడం, అతన్ని అక్కడ అరెస్టు చేయడంలో ఆంతర్యాన్ని సామాన్యులు కూడా అర్థం చేసుకోకుండా ఉండరు. న్యాయస్థానమంటే అంత చులకనా... పాదయాత్రపై ఉన్నత న్యాయస్థానం కూడా నిలుపుదలచేయలేమని చెప్పి, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదనని స్పష్టం చేసింది. అటువంటప్పుడు కూడా పాదయాత్ర ప్రారంభం కాకుండానే పదివేల మంది పోలీసులతో భగ్నం చేయడం, ఆ వర్గానికి చెందిన నేతలను అన్యాయంగా గృహ నిర్బంధానికి గురిచేయడం వల్ల చంద్రబాబు ఆ వర్గానికి బాగా దూరమైందనే చెప్పకతప్పదు. పోలీసుల నిర్బంధంతో ఆ సామాజికవర్గ ఉద్యమాన్ని ప్రస్తుతానికి అణచివేసి ఉండవచ్చు. ఆ సామాజికవర్గం కూడా పోలీసు కేసులకు భయపడి ప్రస్తుతానికి నెమ్మదించవచ్చు. కానీ భవిష్యత్తులో కూడా ఇలానే జరుగుతుందని సర్కార్ అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. అందునా ఉద్యమ నేత పాదయాత్ర చేసి తీరతామని ఆ విషయాన్ని వచ్చే నెల 2న ఖరారు చేస్తామంటున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంత తొక్కిపెట్టాలని ప్రయత్నించినా నిష్ఫలమే అవుతుంది. -
దివీస్ బాధితులకు దన్నుగా..
సర్కారు దౌర్జన్యాలపై సమరోన్ముఖంగా 22న జిల్లాకు రానున్న వైఎస్సార్ సీపీ అధినేత జగ¯ŒS పర్యటనను విజయవంతం చేయాలన్న జిల్లా నేతలు కాకినాడ : దివీస్ పరిశ్రమ కారణంగా నిర్వాసితులయ్యే కోన ప్రాంత ప్రజలకు అండగా నిలిచి, ప్రభుత్వంపై పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఈ నెల 22న జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. దివీస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి జగ¯ŒSకు మద్దతుగా నిలవాలని కోరింది. వైఎస్సార్ సీపీ జిల్లా «అధ్యక్షుడు కురసాలకన్నబాబు అ««దl్యక్షతన శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్ల సమావేశం జరిగింది. కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం దివీస్ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ఇళ్లకిలోకి చొరబడి దాడులు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. వేలాది పేద కుటుంబాల జీవితాలను పణంగా పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం దివీస్ «కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తోందని, జనపక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీపై అభివృద్ధి నిరోధక శక్తిగా ముద్రవేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఎస్ఈజడ్ పేరుతో సేకరించిన పదివేల ఎకరాలుండగా కొత్తగా దివీస్ కోసం 650 ఎకరాలు సేకరించడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. మితిమీరుతున్న ‘దేశం’ అరాచకాలు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తుని సహా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలు మితిమీరి పోతున్నాయని, ఇందుకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ చేస్తున్న ‘గడపగడపకూ వైఎస్సార్’కు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుంటే.. టీడీపీ జనచైతన్య యాత్రలు వెలవెల బోతున్నాయన్నారు. కలెక్టర్ అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ప్రోటోకాల్ విషయంలో 5 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న జగనన్న నేతృత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు. సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ దివీస్ బాధితులకు మనోధైర్యం కల్పించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ టీడీపీది ఆటవిక పాలనని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాస్తూ పోలీసురాజ్యాన్ని నడుపుతున్నారన్నారు. జిల్లాలో రాక్షస పాలన పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, ముత్తా శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో అధికార పార్టీ రాక్షస పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజమండ్రి రూరల్æ కో ఆర్డినేటర్ గిరజాల బాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. మండపేట కో ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ మాట్లాడుతూ తమ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి రూ.2 కోట్లు అక్రమంగా వసూలు చేయడంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ అధికార పక్ష వేధింపులపై సమష్టిగా పోరాడాలన్నారు. రాజమండ్రి కౌన్సిల్లో పార్టీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలంతా సైనికుల్లా పోరాడాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టి బత్తులు రాజాబాబు, అత్తిలి సీతారామస్వామి మాట్లాడుతూ జగ¯ŒSకు జిల్లా అంతటా మద్దతుగా నిలవాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS ని««దlులను దారి మళ్ళించడాన్ని సమావేశం తప్పుబట్టింది. పంచాయతీల్లో పన్నులను మూడింతలు పెంచాలన్న ప్రభుత్వ విధానాన్ని పునః సమీక్షించాలని కోరింది. వివిధ నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు పర్వత పూర్ణచంద్రప్రసాద్, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, ఆకుల వీర్రాజు, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, మోతుకూరి వెంకటేష్, వట్టికూటి రాజశేఖర్, పెయ్యల చిట్టిబాబు, ఏడిద చక్రం, పాలెపు ధర్మారావు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు వలవల బాబ్జీ, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు పెట్టా శ్రీనివాస్, అబ్దుల్ బషీరుద్దీన్, సిరిపురపు శ్రీనివాసరావు, జిల్లా అ«ధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, కాకినాడ నగరకమిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబీ, అమలాపురం పట్టణ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.