- 17వ తేదీ పర్యటన వాయిదా
- దివీస్ బాధితులతో ముఖాముఖి
22న జిల్లాకు జగన్ రాక
Published Mon, Nov 14 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
కాకినాడ:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22న జిల్లాకు రానున్నారు. తుని నియోజకవర్గంలో ప్రతిపాదించిన దివీస్ రసాయన పరిశ్రమ బాధితులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోమవారం కాకినాడలో విలేకర్లకు తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 17వ తేదీన జగన్ జిల్లాకు రావల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన 22వ తేదీకి మారిందని చెప్పారు. జిల్లాలోని పార్టీ శ్రేణులు, దివీస్ నివాసిత ప్రాంత ప్రజలు ఈ మార్పును గమనించాల్సిందిగా వారు కోరారు.
Advertisement
Advertisement