comming
-
రేపు రాష్ట్ర రజక సహకార సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ రాక
కాకినాడ సిటీ : రాష్ట్ర రజక సహకార సొసైటీ ఫెడరేష¯ŒS చైర్మ¯ŒS రాజమండ్రి నారాయణ గురువారం జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు కాకినాడ చేరుకుని బీసీ కార్పొరేష¯ŒS ఈడీతో రజక సంక్షేమ అంశాలపై చర్చిస్తారు. అనంతరం కలెక్టర్‌తో సమావేశమవుతారు. సాయంత్రం 4గంటలకు జిల్లాలని రజక సంక్షేమ సంఘాల ప్రతినిధులను కలుస్తారు. -
రేపు తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య రాక
కాకినాడ సిటీ : తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సోమవారం జిల్లాకు రానున్నారు. ఆయన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి సోమవారం ఉదయం 7.30 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక సరోవర్ పోర్టికోలో బస చేస్తారు. అనంతరం 11 గంటలకు కాకినాడ ఏడీబీ రోడ్డులోని ఉండూరు సెంటర్లో జువెల్ సిటీ ఫేజ్–2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి రాత్రి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి హైదరాబాద్ వెళతారు. -
ట్రూజెట్ బెంగళూర్ విమానం రాక
మధురపూడి : ట్రూజెట్ సంస్థ గతంలో రాజమహేంద్రవరం – బెంగళూర్ మధ్య నడిపిన విమాన సర్వీసు ఆదివారం మళ్లీ ప్రారంభమైంది. ఈ విమానం బెంగళూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ఉదయం 7.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకొని 8 గంటలకు తిరుగుపయనమైంది. ఈ విమానాన్ని వారంలో ఏడు రోజులూ నడుపుతామని నిర్వాహకులు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుతం సోమవారం మాత్రమే ఈ సర్వీసు నడుస్తుందని, మంగళవారం నుంచి నడపడంపై అప్పటి పరిస్థితినిబట్టి నిర్ణయిస్తారని ట్రూజెట్ స్థానిక ప్రతినిధి తెలిపారు. -
బీచ్ ఫెస్టివల్‌కు చురుగ్గా ఏర్పాట్లు
కాకినాడ బీచ్, కోరంగి, హోప్ ఐలాండ్లు వేదికలు వేడుకలకు విస్తృత ఏర్పాట్లు కాకినాడ సిటీ : సంక్రాంతి నేపథ్యంలో పండగ వాతావరణం ఉట్టిపడేలా కాకినాడ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ బీచ్, కోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్లు వేదికలుగా వినూత్న రీతిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి 15 వరకూ నాలుగు రోజులు ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రధాన వేదికైన బీచ్‌లో వేడుకలు జరుగనున్నాయి. పగలు బీచ్ కబడ్డీ, వాలీబాల్, కుస్తీ, యోగ, డ్యా¯Œ్స విత్ కలర్స్ తదితర కార్యక్రమాలతో పాటు వాటర్ జెట్స్, స్కీయింగ్, పారాసైలింగ్, హెలికాఫ్టర్ రైడ్ వంటి వినూత్న ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు హాట్ ఎయిర్ బెలూ¯ŒS రైడింగ్ ఏర్పాటుకు ఆయా సంస్థలతో సంప్రదిస్తున్నారు. సైకత శిల్పకళా ప్రదర్శనలు, రంగోలీ పోటీలు పర్యాటకులను అలరించనుండగా, అరుదైన చేపలు, ఫల పుష్పాదులతో ఆక్వేరియం, ప్లోరీషోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వివిధ వంటకాల రుచులు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు చేప, రొయ్య, పీత వంటకాలతో సీఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన మన ఫౌల్ట్రీపరిశ్రమ, నేషనల్ ఎగ్ కార్పొరేష¯ŒS సహకారంతో కోడిగుడ్లతో వివిధ రకాల వంటకాల ‘ఎగ్ ఫెస్టివల్’ నిర్వహించనున్నారు. సందర్శకులకు మంచి షాపింగ్ అనుభూతి కోసం సూరత్, సేలం, ఉత్తరప్రదేశ్‌ల ఉత్పత్తులతో నేషనల్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్, శిల్పారామం కాస్మొటిక్స్, జ్యూయలరీ ఫిమేల్ షాపింగ్, డ్వాక్రా బజార్ తదితర స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా పర్యాటక ఆకర్షణలను ఫొటోలుగా టీవీ స్క్రీ¯ŒSలపై చూపే స్లైడ్షోలు ప్రదర్శించే ఫొటో ఎగ్జిబిష¯ŒS ఏర్పాటు చేస్తున్నారు. రోజుకో థీమ్‌లో సందడి సంబరాలను ఒక్కో రోజు ఒకో థీమ్‌తో నిర్వహించనున్నారు. 12న ఇంటీనైట్, 13న సౌల్ నైట్, 14న బ్లూ నైట్, 15న వుయ్ ఆర్ది నైట్ థీమ్‌లు ఉంటాయి. జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందిన కళాకారులు కేకే, సోనునిగమ్, నరేష్ అయ్యర్ వంటి ప్రముఖ కళాకారులు తమ ప్రదర్శనలతో సందర్శకులను ఉర్రూతలూగించనున్నారు. హోప్ ఐలాండ్‌కు బోట్ యాత్ర కోరంగి నుంచి హోప్ ఐలాండ్ వరకూ బోట్ క్రూయిజ్ యాత్ర, అందర్నీ అలరించనుంది. హోప్ ఐలాండ్‌లో సాయంత్రం గడిపేందుకు తాత్కాలిక కుటీరాలు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అటవీశాఖ సహకారంతో హోప్ఐలాండ్ ఇసుక తిన్నెల్లో ఆలీవ్ రిడ్లీ తాబేళ్ల సంచారం, గుడ్లు పెట్టే అరుదైన దృశ్యాలను చూసే అవకాశం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా... జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా బీచ్ ఫెస్టివల్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీచ్‌ఫెస్టివల్ ఏర్పాట్లను వివరించారు. ఈ ఫెస్టివల్ నిర్వహణకు రాష్ట్ర పర్యాటకశాఖ రూ.2.5 కోట్లు కేటాయించిందన్నారు. కాకినాడ బీచ్‌తో పాటు కోరంగి అభయారణ్యం, హోప్ఐలాండ్లలో పర్యావరణానికి విఘాతం లేని విధంగా ఆహ్లాదకర అంశాలను ఈ సంబరాల్లో చేర్చామన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపరంగా గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, అఖండ గోదావరి ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ భీమశంకరం, టూరిజం అసిస్టెంట్ ఆఫీసర్ వెంకటాచలం పాల్గొన్నారు. -
త్వరలో మెక్లారిన్ మహిళా వైద్య కళాశాల
కాకినాడ: వందేళ్ల చరిత్ర కలిగిన కాకినాడ మెక్లారి¯ŒS హైస్కూల్ ఆవరణలో రూ.645 కోట్లతో మహిళా వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు సీబీసీఎ¯ŒSసీ అధ్యక్షుడు డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ చెప్పారు. ఉత్తర సర్కార్ జిల్లాల బాప్టిస్టు సంఘాల మహాసభలు శుక్రవారం కాకినాడ సీబీఎం ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో డాక్టర్ రత్నకుమార్ మాట్లాడుతూ మహిళా వైద్య కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ ఆమోదం లభించిందని, త్వరలోనే భవన నిర్మాణం చేపడతామన్నారు. కళాశాల స్థాపనకు కెనడియ¯ŒS ఓవర్సిస్ మిష¯ŒS ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. సీబీసీఎ¯ŒSసీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఏడు మహిళా కళాశాలలు, న్యాయవిద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీబీసీఎ¯ŒSసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 245 పాఠశాలల ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఈ మహాసభల్లో ఆల్ ఇండియా క్రిస్టియ¯ŒS కౌన్సిల్ అధ్యక్షుడు జార్జి, సీవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు మూర్తిరాజు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కోరా జయరాజు, గోదావరి అసోసియేష¯ŒS డైరెక్టర్ ఎజ్రా రమేష్, రాజమహేంద్రవరం అసోసియేష¯ŒS అధ్యక్షుడు రమేష్‌కుమార్, కోటనందూరు అసోసియేష¯ŒS అధ్యక్షుడు బి.శామ్యూల్ తదితరులు ప్రసంగించారు. ‘ప్రేమామయుడు’ క్రైస్తవ భక్తిగీతాల ఆడియో సీడీని ఆవిష్కరించారు. -
రేపు సీఎం రాక
కాకినాడ సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గు రువారం జిల్లా పర్యటనకు రానున్నా రు. ఆ రోజు ఉదయం 9 గంటలకు విజయవా డ నుంచి హెలికాప్టర్లో బయలుదేరే సీఎం 9. 55 గంటలకు రామచంద్రపురం చేరుకుంటారు. 10 గంటలకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని, కొత్తగా నిర్మించిన కార్యాలయ భవనం, క్యాంపు కార్యాలయం, స్త్రీశక్తి భవనాలను ప్రారంభిస్తారు. కాజులూరు మండలం జగన్నాథగిరివద్ద కోరంగి కెనాల్‌పై నిర్మించిన వంతెనను, రెండు పంచాయతీరాజ్ రోడ్లను, పట్టణంలోని చప్పిడివారి సావరంలో నిర్మించి న మున్సిపల్ ఓపె¯ŒS ఆడిటోరియాలను ప్రా రంభిస్తారు. 10.55 గంటలకు వీఎస్ఎం కళాశాలకు చేరుకుని, 19వ వార్డు జన్మభూమి గ్రా మసభలో పాల్గొంటారు. 1.10 గంటలకు బైపాస్ రోడ్డులోని హెలిప్యాడ్‌కు చేరుకుం టారు. 1.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు పిఠాపురం చేరుకుం టారు. 2.15 గంటలకు పాదగయ సమీపంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన స్థూపాన్ని ఆవిష్కరించి, శంకుస్థాపన చేస్తారు. 5 గంటల వరకూ జరిగే సభలో పాల్గొంటారు. 5.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళతారు. -
నేడు బీవీ రాఘవులు రాక
కాకినాడ సిటీ : సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు శనివారం జిల్లాకు రానున్నారని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.వీరబాబు శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కొంతకాలంగా దివీస్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందేనని అయితే బహిరంగసభకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శనివారం దివీస్ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా బీవీ రాఘవులు వస్తారన్నారు. -
సత్యదేవుని సన్నిధిలో కంచి పీఠాధిపతులు
ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు జయేంద్ర సరస్వతి సూచన చిన్న దేవాలయాలను పెద్ద ఆలయాలు దత్తత తీసుకోవాలి సత్యదేవునికి కంచి పీఠాధిపతి, ఉత్తరాధికారి విశేష పూజలు అన్నవరం : హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు ’ప్రజల వద్దకు «ధర్మం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలని కంచి కామకోటి పీఠా«ధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు సూచించారు. రత్నగిరికి విచ్చేసిన జయేంద్ర సరస్వతి స్వామీజీ, విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆదివారం ఉదయం గర్భాలయంలో సత్యదేవుడికి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం చినరాజప్ప వారిని కలిసి ఆశీస్సులు పొందారు. జయేంద్ర సరస్వతి తరఫున విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ టీటీడీ నిర్వహిస్తున్న ’మనగుడి’ కార్యక్రమం చాలా బాగుందని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలు కనీసం రెండు జిల్లాల్లోని దేవాలయాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. వేదపాఠశాలలను ఎక్కువగా స్థాపించి ఎక్కువ మంది విద్యార్థులు వేదం అభ్యసించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్నవరం దేవస్థానంలో రూ.2.3 కోట్లతో స్మార్త, ఆగమ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, దానిని వేదపాఠశాలగా మార్చే ప్రతిపాదన కూడా ఉందని దేవస్థానం ఈఓ కె. నాగేశ్వరరావు పీఠాధిపతులకు వివరించారు. పీఠాధిపతి, ఉత్తరాధికారికి ఘనంగా పూజలు సత్యదేవుని దర్శనం అనంతరం ఆలయంలోని విశిష్ట వ్రతమండపంలో పీఠా«ధిపతి, ఉత్తరాధికారులకు దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు పూజలు చేశారు. పండితులు ఆశీర్వచనాలు అందచేశారు. నాలుగు వేదాల పండితులు వేదాలను పఠించారు. ఐదు రకాల పళ్లు, రూ. 10,116 నగదు పారితోషికాన్ని చైర్మన్, ఈఓ వారికి సమర్పించారు. కంచి పీఠం తరఫున పీఠాధిపతి జయేంద్రసరస్వతి స్వామీజీ చైర్మన్, ఈఓలకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నా«థరావు పాల్గొన్నారు. అతిరుద్ర మహాయాగం సందర్శించిన ఉత్తరాధికారి పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి కావాలనే ధ్యేయంతో రత్నగిరిపై నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగాన్ని ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించారు. -
నేడు సీఎం రాక
మూడు నియోజకవర్గాల పరిధిలో పలు ప్రారంభాలు, శంకుస్థాపనలు సాక్షి, రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9.20 నుంచి రాత్రి 8 గంటల వరకు రాజమహేంద్రవరం నగరం, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో ఎనిమిది ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 9.20 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారం చేరుకుని పరిపాలనాభవనాన్ని ప్రారంభిస్తారు. ఖైదీల కోసం నిర్మించే 50 పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేస్తారు. 10.10 గంటలకు రూరల్ పరిధిలోని శాటిలైట్ సిటీలో నిర్వహించే జనచైతన్య యాత్రలో పాల్గొంటారు. తర్వాత 11.45 గంటలకు చెరుకూరి కల్యాణ మండపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు నగరంలోని మున్సిపల్ స్టేడియానికి చేరుకుని డ్వాక్రా సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కారెం శివాజీ నిర్వహించే దళిత సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు దివా¯ŒSచెరువులోని నగరవనాన్ని ప్రారంభించి, ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేస్తారు. రాత్రి 7.10 గంటలకు నన్నయ యూనివర్సిటీకి చేరుకుని లైబ్రరీ భవనం, హాస్టల్ సముదాయం ప్రారంభిస్తారు. అక్కడ నుంచి 7.30 గంటలకు బయలుదేరి జీఎస్ఎల్ ఆస్పతికి చేరుకుని డెంటల్ కళాశాలను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి మధురపూడి చేరుకుని రాత్రి 8:.0గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ వెళతారు. శుక్రవారం డిప్యూటీ సీఎం చినరాజప్ప, కలెక్టర్ అరుణ్‌కుమార్, రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఇ¯ŒSచార్జి ఎస్పీ గోపీనాథ్ జెట్టి, సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ఇతర అధికారులు సీఎం పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
22న జిల్లాకు జగన్ రాక
17వ తేదీ పర్యటన వాయిదా దివీస్ బాధితులతో ముఖాముఖి కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఈ నెల 22న జిల్లాకు రానున్నారు. తుని నియోజకవర్గంలో ప్రతిపాదించిన దివీస్ రసాయన పరిశ్రమ బాధితులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోమవారం కాకినాడలో విలేకర్లకు తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 17వ తేదీన జగన్ జిల్లాకు రావల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన 22వ తేదీకి మారిందని చెప్పారు. జిల్లాలోని పార్టీ శ్రేణులు, దివీస్ నివాసిత ప్రాంత ప్రజలు ఈ మార్పును గమనించాల్సిందిగా వారు కోరారు. -
17న జిల్లాకు జగన్ రాక
‘దివీస్’ నిర్వాసితులతో ముఖాముఖీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఈ నెల 17న జిల్లాకు రానున్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో దివీస్ రసాయన పరిశ్రమ ఏర్పాటుతో నిర్వాసితులయ్యే కుటుంబాలతో ఆయన మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. దివీస్ కర్మాగారం ఏర్పాటుతో భవిష్యత్తులో సుమారు 12 గ్రామాల ప్రజలు ఊళ్లకు ఊళ్లు ఖాళీచేసి వెళ్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దివీస్ బాధిత గ్రామాల్లో బా«ధితులతో జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ముఖాముఖీ నిర్వహించనున్నారని కన్నబాబు చెప్పారు. పోలీసుల సాయంతో సుమారు 60 రోజులుగా దివీస్ బాధిత గ్రామాల్లో 144 సెక్ష¯ŒS అమలుచేస్తూ గ్రామస్తులపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్న విషయంపై జగ¯ŒS మోహ¯ŒSరెడ్డి తీవ్ర ఆవేదన చెందుతున్నారని కన్నబాబు పేర్కొన్నారు. -
డిజిటల్ బడులు వస్తున్నాయ్..
సాంకేతిక విద్యాబోధనకు శ్రీకారం తొలి దశలో 118 పాఠశాలల ఎంపిక ప్రభుత్వ పాఠశాలల్లో 20 నుంచి ప్రారంభం రాయవరం : ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూడు దశల్లో ఈ పథకం అమలుకు ప్రణాళికను నిర్దేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించేందకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దృశ్యరూపంలో పాఠ్య బోధన.. పదిసార్లు విన్నదానికంటే ఒక్కసారి చూస్తే ఆ దృశ్యం మైండ్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ప్రతి రోజు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విన్న అనంతరం విద్యార్థులు దానిని మననం చేసుకుంటారు. అదే పాఠాన్ని దృశ్యరూపంలో విద్యార్థులకు చూపిస్తే ఎన్నటికీ గుర్తుండిపోతుంది. పరీక్షల్లోను జవాబులను జ్ఞాపకాల జ్ఞాపకశక్తి, అవగాహనతో రాయగలుగుతారు. పాఠాలను దృశ్యరూపంలో విద్యార్థులకు చూపించే ప్రయత్నమే డిజిటల్ విద్యాతరగతులు. జిల్లాలో తొలి విడతగా 118 ఉన్నత పాఠశాలల్లో ఈ నెల 20న డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయోజనాలివే.. పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలను ప్రొజెక్టర్ ద్వారా దృశ్య రూపంలో విద్యార్థులు తెరపైన చూస్తారు. ప్రతి పాఠానికి సంబంధించిన సీడీల ద్వారా దృశ్య బోధన ఉంటుంది. విద్యార్థులు తరగతిలో విన్నదానికంటే తేలికగా అర్ధం చేసుకోగలరు. సాధారణ బోధనలో విజ్ఞాన పటాలు, అంతరిక్షం, వివిధ ప్రయోగాలు చూడడం ద్వారా విద్యార్థి మదిలో ఆ విషయాలు నిక్షిప్తమవుతాయి. తరగతి గది బోధన అనంతరం తెరపై తిరిగి దృశ్యరూపంలో చూడడం వల్ల పలు అనుమానాల నివృత్తికి అవకాశం ఉంటుంది. పరీక్షల సమయంలో దృవ్య రూపంలో చూడడం వల్ల ఆ సమస్య కళ్ల ముందు కదలాడి సరైన జవాటు రాసే వీలుంటుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు పలికే విధానం, వాస్తవంగా పలకాల్సిన విధానం ఉపాధ్యాయులకు సైతం ఉపయోగకరంగా ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులకు ఈ–బోధన ఎంతో ప్రయోజనం. పాఠాన్ని వేగంగా అవగాహన చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లిషు మీడియంలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు, తెలుగు మీడియంలో 6 నుంచి 10వ తరగతి వరకు రాష్ట్ర సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యాంశాల వారీగా దృశ్య రూపంలోకి పాఠ్యాంశాలను మారుస్తున్నారు. డిజిటల్ పాఠశాలలకు.. డిజిటల్ తరగతుల నిర్వహణకు ఎంపికైన పాఠశాలలకు ఇంటర్నెట్, ప్రొజెక్టర్, కంప్యూటర్ తెర అమరుస్తారు. కంప్యూటర్ తెరపై టచ్ స్క్రీన్ మాదిరిగా పనిచేయడం విశేషం. వీటితో పాటు రెండు కంప్యూటర్లు, యూపీఎస్, ప్రింటర్, అదనపు హార్డ్ డిస్క్‌లను సరఫరా చేస్తారు. డిజిటల్ తరగతుల నిర్వహణలో నెట్ సౌకర్యం ఉండడంతో ఇంటర్నెట్ నుంచి పాఠాలకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ౖడౌన్లోడ్ చేసి విద్యార్థులకు ప్రదర్శించే వీలుంటుంది. ఇప్పటికే వందలాది విద్యా వెబ్సైట్లు, యూట్యూబ్‌లో అనేక విద్యా సంబంధిత వీడియోలు ఉచితంగా లభిస్తున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలల్లోని ఆసక్తిగల టీచర్స్‌కు ఈ బోధనపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సద్వినియోగం చేసుకుంటే.. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు ఇది దోహదపడుతుంది. పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. – ఆర్.నరశింహారావు, జిల్లా విద్యాశాకాధికారి, కాకినాడ -
నేడు ముఖ్యమంత్రి రాక
విమానాశ్రయ విస్తరణకు భూమి పూజ హాజరు కానున్న కేంద్ర మంత్రులు సాక్షి, రాజమహేంద్రవరం : మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం రన్‌వేను 1,750 మీటర్ల నుంచి 3,165 మీటర్లకు విస్తరించే పనులకు సోమవారం భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పలువురు రాష్ట్రమంత్రులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. భూమిపూజ అనంతరం రాష్ట్రంలోని విమానాశ్రయాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య చర్చలు జరగనున్నాయి. అనంతరం అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు సీఎం చేతుల మీదుగా సన్మానం చేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమాల అనంతరం చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్నారు. -
డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణానికి త్వరలో టెండర్లు
ఎమ్మెల్యే గొల్లపల్లి అంతర్వేది (సఖినేటిపల్లి) : అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.850 కోట్లతో త్వరలో టెండర్లు పిలవనున్నదని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. కోస్టల్ ఇండియా డెవలప్మెంట్ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి, మలేషియా ప్రతినిధుల బృందం, జీఎమ్మార్ గ్రూపు ప్రతినిధులతో కలిసి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అటు డ్రెడ్జింగ్, ఇటు ఫిషింగ్ హార్బర్లతో అంతర్వేది పారిశ్రామిక హబ్‌గా రూపు దిద్దుకోనున్నదని చెప్పారు. డ్రెడ్జింగ్ హార్బర్‌పై అడిగిన ప్రశ్నలకు కోస్టల్ ఇండియా డెవలప్మెంట్ చైర్మన్ శాస్త్రి సమాధానాలు దాటవేశారు. అంతర్వేది పారిశ్రామికంగా ఏనాడో అభివృద్ధి చెందాల్సి ఉందని, ఇప్పటికే ఎంతో జాప్యం జరిగిందని అన్నారు. తాము నిమిత్తమాత్రులమని, పనులన్నింటినీ శ్రీలక్ష్మీ నృసింహస్వామివారే చూసుకుంటున్నారని వేదాంత ధోరణిలో చెప్పారు. జీఎమ్మార్ గ్రూపు ప్రతినిధి రాజు మాట్లాడుతూ, డ్రెడ్జింగ్ హార్బర్‌కు అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలు రానున్నాయని, విశాలమైన రోడ్లు వస్తాయని చెప్పారు. ఆలయం వద్ద వారికి ప్రధాన అర్చకుడు కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మలేషియాకు చెందిన డేటో పీటర్ టేన్ పొయిటెల్, డేటన్కింకో తదితరులు, జీఎమ్మార్ ప్రతినిధులు నితిన్ అగర్వాల్, బీవీఎన్ రావు, రాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ తదితరులు పాల్గొన్నారు. హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన విదేశీ ప్రతినిధులు కరవాక (మామిడికుదురు) : సముద్ర తీరంలోని కరవాక గ్రామంలో రూ. 500 కోట్లతో ప్రైవేటు రంగంలో హార్బర్ నిర్మించనున్న స్థలాన్ని విదేశీ ప్రతినిధుల బృందం శుక్రవారం పరిశీలించింది. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యాన సెంట్రల్ కోస్టల్ అథారిటీ చైర్మన్ శాస్త్రి, మలేషియా, కొరియా దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం తీరంలో పర్యటించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ 500 ఎకరాల విస్తీర్ణంలో ప్రైవేటు హార్బర్ నిర్మిస్తామన్నారు. హార్బర్ నిర్మాణానికి ఇక్కడి పరిస్థితులు అనువుగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ భూమి 240 ఎకరాలు, సొసైటీ భూమి 260 ఎకరాలు దీనికోసం సేకరిస్తామన్నారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ, హార్బర్ నిర్మాణం ద్వారా తీరప్రాంత మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం కలగడంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.