ట్రూజెట్ బెంగళూర్ విమానం రాక
Published Sun, Jan 8 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
మధురపూడి :
ట్రూజెట్ సంస్థ గతంలో రాజమహేంద్రవరం – బెంగళూర్ మధ్య నడిపిన విమాన సర్వీసు ఆదివారం మళ్లీ ప్రారంభమైంది. ఈ విమానం బెంగళూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ఉదయం 7.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకొని 8 గంటలకు తిరుగుపయనమైంది. ఈ విమానాన్ని వారంలో ఏడు రోజులూ నడుపుతామని నిర్వాహకులు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుతం సోమవారం మాత్రమే ఈ సర్వీసు నడుస్తుందని, మంగళవారం నుంచి నడపడంపై అప్పటి పరిస్థితినిబట్టి నిర్ణయిస్తారని ట్రూజెట్ స్థానిక ప్రతినిధి తెలిపారు.
Advertisement
Advertisement