madhurapudi
-
ఓ ఊరికి ఆత్మ ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ: మల్లికార్జున్
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లికార్జున్ దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మల్లికార్జున్ మాట్లాడుతూ – ‘‘ఓ మనిషికి ఆత్మ ఉంటుందన్నట్లుగానే.. ఓ ఊరికి ఆత్మ ఉంటే ఏం జరుగుతుందనే కల్పిత కథే ఈ చిత్రం. ఓ వ్యక్తి మరో వ్యక్తి తలను నరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడనే వార్తను నా చిన్నతనంలో చదివాను. ఆ విజువల్‌ను ఊహించుకుంటూ ఈ సినిమా కథను అల్లుకున్నాను. అయితే ఆ ఘటనకు, ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదు. పోరాటం, స్నేహం, రాజకీయం... ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న రా అండ్ రస్టిక్ ఫిల్మ్. సూరి పాత్రలో హీరో శివ నా విజన్‌కి తగ్గట్లు నటించాడు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. మణిశర్మగారి సంగీతం ఈ చిత్రానికి అదనపు బలం. కరోనా తర్వాత తెలుగు సినిమా మారిపోయింది. ఆరు ఫైట్లు.. ఆరు పాటలు అంటే ఆడియన్స్ చూడటం లేదు. కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమా తీశాను. ఇక ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నా దగ్గర ఓ కథ ఉంది’’ అన్నారు. మవుతుంది. -
జత కట్టినప్పుడు గుర్తుకు రాలేదా బాబూ!
మధురపూడి (రాజానగరం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో ముఖ్యమంత్రి చంద్రబాబు జతకట్టినప్పుడు గుర్తుకురాలేదా, ఇప్పుడు విమర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి దుయ్యబట్టారు. కోరుకొండ మండలంలో శనివారం సుడిగాలి పర్యటన చేవారు. బుచ్చెంపేటలో జక్కంపూడి గణేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర వద్దకు చేరుకుని, యాత్రలో పాల్గొన్న యువతను అభినందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి విలేకర్లతో మాట్లాడుతూ అమరావతి రాజధాని శంకుస్థాపనకు గంగానది నీరు. మట్టి తీసుకొచ్చినప్పుడు పొగిడిన చంద్రబాబు, ఇప్పుడు విమర్శించడం ఎంత వరకూ సబబన్నారు. అప్పుడెందుకు చెలిమికట్టారు, ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బాబు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. యువనేస్తం పథకాన్ని కన్నీటితుడుపుగా నిర్వహించారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం మద్దతు ఉందని, పొత్తుల కోసం ఆరాటపడే నాయకుడు కాదని జక్కంపూడి అన్నారు. అలాగే జక్కంపూడి కుటుంబం ప్రజల సంక్షేమానికి అలుపెరగకుండా పొరాటం చేస్తుందన్నారు. అనంతరం గాదరాడలో ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. -
లోహ విహంగాలకు వరుణుడి పగ్గాలు
ప్రతికూల వాతావరణంతో విమాన ప్రయాణాలకు ఆటంకాలు విజిబులిటీ సమస్యతో ఆలస్యమవుతున్న సర్వీసులు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మధురపూడి : విమానయానానికి కొద్ది రోజులుగా మేఘాలు పగ్గాలు వేస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతూండడంతో రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు ల్యాండింగ్ అవ్వాలన్నా, టేకాఫ్ తీసుకోవాలన్నా పైలట్‌కు రన్‌వే విజిబిలిటీ (దూరంగా ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడం) బావుండాలి. లేకుంటే ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం కొన్నాళ్లుగా వర్షాలు కురుస్తూండడం, ఆకాశం తరచూ మేఘావృతమై, విజిబిలిటీ సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలకు బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు పొగమంచు వాతావరణం ఏర్పడి, విజిబిలిటీ మరింత పడిపోతోంది. తరచూ విమానాలు జాప్యం కావడమో లేక రద్దవడమో జరుగుతూండడంతో విమానాశ్రయంలో ప్రయాణికుల సందడి తగ్గింది. రోజూ 6 సర్వీసులు రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, ట్రూజెట్ సంస్థలకు చెందిన 6 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు ట్రూజెట్ మొదటి సర్వీసుతో మొదలై, సాయంత్రం 4.30 గంటలకు వీటి రాకపోకలు ముగుస్తున్నాయి. వీటిలో సుమారు 700 మంది ప్రయాణాలు సాగిస్తారు. మామూలు రోజుల్లో ఒక్కో విమానానికి 55 నుంచి 70 మంది ప్రయాణిస్తుంటారు. దీంతో టెర్మినల్ భవనం సందడిగా ఉంటుంది. కానీ, కొన్నాళ్లుగా వర్షాలు కురుస్తూండడంతో విమానాలు సరిగా రాకపోవడంతో ప్రయాణికుల సంఖ్య 40 నుంచి 50 మధ్యకు పడిపోయింది. తరచుగా ఏదో ఒక విమానం సాంకేతిక కారణాలతో రద్దవుతోంది. మరోపక్క ప్రతికూల వాతావరణంతో దాదాపు ప్రతి రోజూ విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. రన్‌వే పూర్తయితే.. ప్రస్తుత వర్షాలవలన విమానాల రాకపోకలకు పెద్దగా ఆటంకాలుండవు. రన్‌వే విస్తరణ పనులు పూర్తయితే ల్యాండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. విమాన ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. - ఎం.రాజ్‌కిషోర్, డైరెక్టర్, రాజమహేంద్రవరం విమానాశ్రయం -
రన్‌వేపై గిరిజన యువకుడు
ఎయిర్‌పోర్టులో కలకలం మధురపూడి (రాజానగరం) : రాజమహేంద్రవరం విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు.. నేతి బీరకాయలో నేతి ఉన్న చందంగా.. ఉంటాయన్న విషయం.. విమానాశ్రయ వర్గాలకే ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం ఎయిర్‌పోర్టు వర్గాల్లో కలకలం రేపింది. ఈ కథా కమామిషు ఇలా ఉంది... ఈ నెల 13వ తేదీ సోమవారం ఏజెన్సీ ప్రాంతం నర్సాపురానికి చెందిన గిరిజన యువకుడు స్వామిదొర ఎయిర్‌పోర్టు ర¯ŒSవేకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. అక్కడ అభివృద్ధి పనుల్లో పనిచేస్తున్న వారితో అతడూ సెక్యూరిటీ షెడ్డులో కూర్చున్నాడు. అతడిని భద్రతా సిబ్బంది ఆలస్యంగా గుర్తించింది. స్వామిదొర వద్ద అగ్గిపెట్టె ఉండటం అందరిలో ఆందోళనను కలిగించింది. అతడిని ఎయిర్‌పోర్టు వర్గాలు కోరుకొండ పోలీసు స్టేష¯ŒSకు అప్పగించాయి. స్వామిదొర మానసికస్థితి సరిగా లేదని ఎస్సై ఆర్. మురళీమోహా¯ŒS తెలిపారు. పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత పూచీకత్తుపై అతడిని విడిచిపెట్టారు. టికెట్ లేని వారు, సందర్శకులను టెర్మినల్ భవనం వరకే ఎయిర్‌పోర్టులో అనుమతిస్తారు. ర¯ŒSవే పైకి, ఎప్రా¯ŒSలోని పార్కింగ్‌బే వెళ్లడానికి ఇతరులకు అనుమతులు ఉండదు. అక్కడ మూడెంచెల రక్షణ వలయం ఉంటుంది స్పెషల్ ప్రొటెక్ష¯ŒS ఫోర్స్, ఎస్పీఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. సుమారు 64 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది కాపలా ఉంటారు. ఎయిర్‌పోర్టులోని అన్ని ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ ఉంటుంది. వీరందరి కన్నుకప్పి ఆ యువకుడు ఎలా వెళ్లాడనే విషయం ఎయిర్‌పోర్టు వర్గాలకు అవగతం కావడం లేదు. -
ట్రూజెట్ బెంగళూర్ విమానం రాక
మధురపూడి : ట్రూజెట్ సంస్థ గతంలో రాజమహేంద్రవరం – బెంగళూర్ మధ్య నడిపిన విమాన సర్వీసు ఆదివారం మళ్లీ ప్రారంభమైంది. ఈ విమానం బెంగళూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ఉదయం 7.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకొని 8 గంటలకు తిరుగుపయనమైంది. ఈ విమానాన్ని వారంలో ఏడు రోజులూ నడుపుతామని నిర్వాహకులు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుతం సోమవారం మాత్రమే ఈ సర్వీసు నడుస్తుందని, మంగళవారం నుంచి నడపడంపై అప్పటి పరిస్థితినిబట్టి నిర్ణయిస్తారని ట్రూజెట్ స్థానిక ప్రతినిధి తెలిపారు. -
టేక్ ‘హాఫ్’
గణనీయంగా తగ్గిన విమాన ప్రయాణికులు రద్దయిన సర్వీసుల ఫలితం శనివారం నాలుగు సర్వీసులతో సరి విమాన ప్రయాణాలకు సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. విమాన సర్వీసుల సంఖ్య తగ్గడం, అందుబాటులో ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. నిత్యం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఆరు సర్వీసులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణించేవి. శనివారం నాలుగు సర్వీసులు మాత్రమే ప్రయాణించాయి. – మధురపూడి కొద్ది రోజులుగా జెట్ ఎయిర్వేస్ చెన్నై సర్వీసు, ట్రూజెట్ బెంగళూరు సర్వీసు రద్దయిన సంగతి తెలిసిందే. గురువారం ప్రారంభించిన స్పైస్‌జెట్ మధ్యాహ్నం సర్వీసు కూడా రద్దయింది. ఇటీవల వచ్చిన వార్థా తుఫా¯ŒSతో చెన్నై సర్వీసులను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. అలాగే నిర్వహణ సమస్య కారణంగా మరికొన్ని రద్దయ్యాయి. తుఫా¯ŒS వీడిన తర్వాత కూడా çవిమాన సర్వీసులను ఆయా సంస్థలు పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. శనివారం కూడా ప్రయాణికుల సంఖ్య పెరగలేదు. ఒక్కొక్క సర్వీసుకు 35 నుంచి 55 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. నిలిచిన ప్రత్యేక సర్వీసులు ఇటీవల మొదలైన ట్రూజెట్ ప్రత్యేక సర్వీసుల సేవలూ నిలిచిపోయాయి. వీటిలో ఓ సర్వీసు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజమహేంద్రవరానికి చేరి, సాయంత్రం 5.40కు గోవాకు బయలుదేరేది. ఉదయం వేళలో రాజమహేంద్రవరం–బెంగళూరు మధ్య ప్రయాణించే మరో సర్వీసు కూడా రద్దయింది. హైదరాబాద్–రాజమహేంద్రవరానికి, ఇక్కడి నుంచి చెన్నైకు ప్రయాణించే జెట్ సర్వీసులూ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. నిత్యం వెయ్యి మందికి అసౌకర్యం ఆరు విమాన సర్వీసుల్లో నిత్యం సుమారు వెయ్యి మంది ప్రయాణికులు రాజమహేంద్రవరానికి రాకపోకలు సాగించేవారు. ఇటీవల కేంద్ర ప్రభు త్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో పాటు తుఫా¯ŒS సమస్యతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శుక్రవారం వీరి సంఖ్య 230 మందికి తగ్గింది. దీంతో విమానాశ్రయం టెర్మినల్‌ను సందర్శించే విజిటర్స్ టిక్కెట్ల కొనుగోళ్లు కూడా తగ్గాయి. సాధారణంగా 120 మంది విజిటర్లు ఈ టిక్కెట్లు కొనేవారు. ఇది 38 మందికి తగ్గింది. మళ్లించడం వల్లే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తుండడంతో పెద్ద విమానాల నిర్వహణ కష్టతరంగా మారిందని విమానయాన సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. అందువల్ల మంచును తట్టుకునే చిన్న విమానాలను ఆయా ప్రాంతాలకు మళ్లించారని చెప్పారు. ఇక్కడి చిన్న సర్వీసులను కూడా అక్కడకు తరలించినట్టు పేర్కొన్నారు. సేవలను పెంపొందించాలి విమాన సర్వీసులను రెగ్యులర్‌గా నిర్వహించడం చాలా అవసరం. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పూర్తి స్థాయి సేవలందేలా చర్యలు తీసుకోవాలి. విమానయాన సంస్థలు ప్రయాణికుల సేవలను పెంపొందించాలి. – పిట్టా కృష్ణ, విమాన ప్రయాణికుడు, బూరుగుపూడి సక్రమంగా నిర్వహించాలి ప్రారంభించిన కొంత కాలానికే సర్వీసులను కొన్ని సంస్థలు రద్దు చేస్తున్నాయి. ఇది సమంజసం కాదు. విమానయాన సంస్థలు పూర్తి స్థాయిలో సేవలు అందించాలి. విమాన సర్వీసులను సక్రమంగా నిర్వహించాలి. – ఆకుల రామకృష్ణ, విమాన ప్రయాణికుడు, మధురపూడి -
5 జెట్ ఎయిర్వేస్ విమానాల సేవలు
మధురపూడి : రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి శనివారం 5 జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు సేవలందించాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సర్వీసు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అది శనివారం ఉదయం 9.10 గంటలకు హైదరాబాద్‌కు పయనమైంది. అలాగే రోజూ 7.45 గంటలకు ఇక్కడికి చేరే మరో సర్వీసు యథాతథంగా చేరి, తిరిగి 8.05 గంటలకు చెన్నై బయలుదేరింది. 10.50 గంటలకు వచ్చిన మరో సర్వీసు 11.14 గంటలకు, మధ్యాహ్నం 1.55 గంటల సర్వీసు, 2.45 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరాయి. సాయంత్రం వచ్చిన మరో విమానం 6.05 గంటలకు ఇక్కడి నుంచి చెన్నైకి పయనమైంది. -
హమ్మయ్య.. క్షేమంగా చేరాం..!
టేకాఫ్‌లో ఊగిసలాడిన విమానం ఆందోళనకు గురైన ప్రయాణికులు మధురపూడి : హైదరాబాద్‌లో బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానం టేకాఫ్ సమయంలో ఊగిసలాడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైనట్టు తెలిసింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఇది బయలుదేరింది. ఈ సర్వీసులో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్నప్పుడు ఒక్కసారిగా పక్కగా ఊగిసలాడిందని, దీంతో తామంతా ఆందోళనకు గురయ్యామని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన సూర్యనారాయణమూర్తి తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక్కడకు చేరుకున్న ప్రయాణికులు తమ బంధువులకు ఈ విషయాన్ని తెలియజేశారు. తమవారు సురక్షితంగా చేరడంతో వారి బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. వర్షాకాలం కావడంతో పెద్ద పక్షులు రన్‌వే ప్రాంతంలో చేరుతున్నాయి. దీనివల్ల విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తుతోంది. ఇటీవల ఓ కొంగ జెట్ ఎయిర్వేస్ విమానాన్ని ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. -
సీఎం టెక్నికల్ హాల్ట్
మధురపూడి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చారు. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జరిగే ఏరువాక కార్యక్రమానికి వెళ్తూ, ఆయన కొద్దిసేపు ఇక్కడ టెక్నికల్ హాల్ట్ చేశారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన బాబు, ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో నర్సాపురం వెళ్లారు. రన్‌వే పై కొద్దిసేపు ఆయన జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. బాబుకు స్వాగతం పలకడానికి కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, డీఐజీ రామకృష్ణ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, డీఎస్పీ ప్రసన్నకుమార్, తహసీల్దార్ కె. పోసియ్య తదితరులు విమానాశ్రయానికి వచ్చారు. కార్యక్రమం అనంతరం చంద్రబాబు తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్లారు. అధికారులు వర్షంలో తడుస్తూ సీఎం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. -
విమానాశ్రయ సమాచారం
మధురపూడి : రాజమండ్రి నుంచి 9 కిలో మీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. మధురపూడి-హైదరాబాద్‌ల మధ్య రోజూ జెట్ ఎయిర్వేస్ రెండు,స్పైస్ జెట్ రెండు వంతున మొత్తం నాలుగు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి మంగళవారం స్పైస్‌జెట్ రెండో సర్వీసు ఉండదు. ఈ రెండు రోజుల్లో మూడు విమానాలు మాత్రమే కొనసాగుతాయి. రాకపోకల సమయాలు జెట్ ఎయిర్వేస్ * మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ ఉదయం 10.30 గంటలకు వచ్చి, తిరిగి 10.55 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది. * రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 2.20 గంటలకు వచ్చి, తిరిగి 2.45 గంటలకు హైదరాబాద్ బయలు దేరుతుంది. * జెట్‌ఎయిర్‌వేస్ కాల్ సెంటర్ నెం. 04039893333), విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ కార్యాలయం నెం. 08832007866. స్పైస్ జెట్ * మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చి, తిరిగి 12.55 గంటలకు హైదరాబాద్ వెళుతుంది. * రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ సాయంత్రం 3.20 గంటలకు వచ్చి, సాయంత్రం 3.45 గంటలకు హైదరాబాద్ వెళుతుంది. * టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు * కాల్ సెంటర్ నం. 09871803333. * విమానాశ్రయంలో అథారిటీ కార్యాలయం నం. 0883-2007838. -
విమానాశ్రయ సమాచారం
మధురపూడి: మధురపూడి-హైదరాబాద్‌ల మధ్య రోజూ జెట్ ఎయిర్వేస్ రెండు, స్పైస్‌జెట్ విమానాలు రెండు చొప్పున నాలుగు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి మంగళ, శనివారాలు స్పైస్‌జెట్ రెండో సర్వీసు ఉండదు. ఈ రెండు రోజుల్లో మూడు విమానాలు మాత్రమే కొనసాగుతాయి. రాకపోకల సమయాలు జెట్ ఎయిర్వేస్ మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ ఉదయం 10.05 గంటలకు వచ్చి, తిరిగి 10.35 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది. రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 1.55 గంటలకు వచ్చి, తిరిగి 2.20 గంటలకు హైదరాబాద్ బయలు దేరుతుంది. (జెట్‌ఎయిర్‌వేస్ కాల్ సెంటర్ నెం. 04039893333), ( విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ కార్యాలయం నెం. 08832007866). స్పైస్‌జెట్ మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 12.05 గంటలకు వచ్చి, తిరిగి 12.30 గంటలకు హైదరాబాద్ వెళుతుంది. రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ సాయంత్రం 3.00 గంటలకు వచ్చి, సాయంత్రం 3.20 గంటలకు హైదరాబాద్ వెళుతుంది. (కాల్ సెంటర్ నెం. 09871803333) టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ( విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు అథారిటీ కార్యాలయం నెం. 08832007838 -
విమానాశ్రయం వద్ద భద్రత పటిష్టం
మధురపూడి, న్యూస్‌లైన్ :మధురపూడిలోని విమానాశ్రయం వద్ద పోలీసు బందోబస్తును మరింత పటిష్టం చేశామని, ఇందులో భాగంగా బీఎస్ఎఫ్ దళాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నట్టు రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ రవికుమార్ మూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఎయిర్‌పోర్టులో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ మిగిలిన పోలీసు స్టేషన్లకు, ఎయిర్‌పోర్టులో పోలీసు స్టేషన్‌కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇక్కడ విమానాశ్రయానికి, అందులో ఉన్న పరికరాలు, భవనాలకు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. ప్రయాణికులు, వారి లగేజి తనిఖీలు తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించడం, రక్షణ కల్పించడం చేస్తారన్నారు. విద్రోహ శక్తుల నుంచి కాపాడడానికి నిరంతర పర్యవేక్షణతో పాటు, రేయింబవళ్లు ప్రత్యేక కూంబింగ్, పెట్రోలింగ్ చేస్తారని వివరించారు. విమానాశ్రయం రోడ్డుకు రెండువైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రోజురోజుకూ రాజమండ్రి విమానాశ్రయం వినియోగంతో పాటుగా ప్రాధాన్యం కూడా పెరిగిందన్నారు. అనంతరం ఆయన నిఘా వ్యవస్థను, రక్షణ, బందోబస్తు నిర్వహణను సమీక్షించారు. ఆయన వెంట కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ జి.మురళీకృష్ణ, కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసిరావు, ఎస్సైలు కనకారావు, వెంకటేశ్వరరావు, ఎయిర్‌పోర్టు పోలీసులు ఉన్నారు. -
పత్రికి వెళ్లి ప్రమాదానికి బలి
దోసకాయలపల్లి (మధురపూడి), న్యూస్‌లైన్ :కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో జరుగుతున్న పూజకు పత్రిని తీసుకు వచ్చేందుకు వెళ్లిన వ్యక్తి లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు.ఈ సంఘటనతో దోసకాయలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన ఉరుము రామారావు(48) ఆదివారం పత్రి తెచ్చేందుకు బూరుగుపూడి గేట్ సమీపంలోని మర్రి చెట్ల వద్దకు వచ్చాడు. మర్రి, ఇతర చెట్ల ఆకులు కోసుకుని వాటిని పోగు చేస్తూ ఉండగా క్వారీ క్రషర్ నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఉంది. కూలిపనే జీవనాధారంగా అతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. రామారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ పూట ఆ ఇంట దారుణమైన దుఃఖం నెలకొనడం బాధాకరమని పలువురు వాపోయారు. కోరుకొండ ఎస్సై బి.వేంకటేశ్వరరావు సంఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. లారీని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. డ్రైవర్ పరారీలో వున్నాడు. సర్పంచ్ సూర్యకుమారి తదిరతరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రాజమండ్రి తరలించారు. రాజమండ్రి-కోరుకొండ-రాజానగరం రోడ్లలో క్వారీ రాళ్లను రవాణా చేసే లారీలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నాగంపల్లి నుంచి రాజమండ్రి రోడ్లలో రాత్రి పగలు తేడా లేకుండా క్వారీలారీలు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.అధికారులు వీటిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
జనం గుండెచప్పుడై...
పండుపున్నమి వేళ సాగరసంగమానికి పోటెత్తిన జీవఝరిలా ప్రతి పదం జగన్మోహన్రెడ్డి బాటలో కదం తొక్కింది. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా అడుగడుగునా జనప్రవాహం పోటెత్తింది. ప్రతి గుండెచప్పుడై జగన్నినాదం ప్రతిధ్వనించింది.బుధవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా అడుగడుగునా జనప్రవాహం పోటెత్తింది.మధురపూడి విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్న అభిమానులుమధురపూడి విమానాశ్రయంలో జగన్‌కు స్వాగతం పలికేందుకు రంపచోడవరం నుంచి వచ్చిన గిరిజన మహిళలుతూర్పు గోదావరి జిల్లా గాడాలలో జగన్‌తో కరచాలనం చేస్తున్న మహిళబుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రసంగిస్తున్న వైఎస్ జగన్జగన్‌కు ఉత్సాహంగా యువకుల అభివాదంరాజమండ్రి శానిటోరియం వద్ద బారులు తీరిన మహిళలురాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో జగన్‌కు అభివాదం చేస్తున్న విద్యార్థులురాజమండ్రి కొంతమూరులో వృద్ధుడిని పలకరిస్తూ....బస్సులో నుంచి ప్రయాణికులు, డ్రైవర్ అభివాదంజక్కంపూడి విజయలక్ష్మి నివాసంలో ఆమె కుమార్తె సింధుసహస్ర, అల్లుడు భుజంగరాయుడులను ఆశీర్వదిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, కోడలు దివ్యశ్రీలకు శుభాకాంక్షలు తెలుపుతున్న జగన్క్వారీమార్కెట్ రోడ్డులో విద్యార్థినిని ముద్దాడుతూ...రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో కార్యకర్తలు ఇచ్చిన శంఖాన్ని పూరిస్తున్న జగన్భారీగా తరలివచ్చిన జనంకు అభివాదం చేస్తున్న జగన్అభిమానులకు అభివాదం చేస్తూ... -
జగన్‌కు ఘన స్వాగతం
మధురపూడి, న్యూస్‌లైన్ :గుండెలో దాచుకున్న అభిమాన నేత చాలాకాలం తర్వాత కనుల ముందు సాక్షాత్కరించడంతో వారిలో ప్రేమాభిమానాలు పెల్లుబికాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. బుధవారం మధురపూడి విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఉదయమే జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి వచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. మూడొంతుల మందిని విమానాశ్రయం వెలుపల ఆర్అండ్బీ రోడ్డుపైనే నిలిపేశా రు. మధ్యాహ్నం 1.55 గంటలకు జెట్ ఎయిర్‌వే స్ విమానంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనను చూడగానే అభిమానులు, నాయకులు పెద్దఎత్తున జయజయధ్వానాలు చేశారు. పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో స్వాగతం పలికారు. పేరుపేరునా పలకరించిన ఆయన ప్రత్యేక కాన్వాయ్‌లో రాజమండ్రి వెళ్లారు. పోలీసుల వైఫల్యం కారణంగా అభిమానులు, ప్రజలు ఆర్అండ్బీ రోడ్డుపై కిక్కిరిసి ఉండడంతో, ఆ ట్రాఫిక్‌లో కాన్వాయ్ రాజమండ్రి చేరుకోవడానికి గంటల వ్యవధి పట్టింది. అభిమానులు, నాయకులు పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విమానాశ్రయం వద్ద జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, అల్లూరి కృష్ణంరాజు, పాతపాటి వీర్రాజు, చెంగల వెంకట్రా వు, బుచ్చిమహేశ్వరరావు, క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర సభ్యు డు ఇందుకూరి రామకృష్ణంరాజు, నేతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చలమలశెట్టి సునీల్, బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, తాడి విజయభాస్కర రెడ్డి, దాడిశెట్టి రాజా, బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, సుంకర చిన్ని, శెట్టిబత్తుల రాజా, ములగాడ ఫణి, కొమ్మిశెట్టి రామకృష్ణ, విపర్తి వేణుగోపాలరావు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఆర్వీ సత్యనారాయణ చౌదరి,టీకే విశ్వేశ్వరరెడ్డి, రాయపురెడ్డి ప్రసాద్(చిన్నా), రెడ్డి రాధాకృష్ణ, పంపన రామకృష్ణ, ఎర్ర సత్యం, చింతపల్లి చంద్రం, మేడిశెట్టి శివరాం, తాడి హరిశ్చంద్ర ప్రసాద్‌రెడ్డి, జ్యోతుల లక్ష్మీ నారాయణ, గణేశుల పోసియ్య, నిడగట్ల బాబ్జీ తదితరులు ఉన్నారు. -
ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన చిరంజీవి
మధురపూడి, న్యూస్‌లైన్ : రాజమండ్రిలో జరిగే రెండు శుభకార్యాలకు హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బుధవారం సాయంత్రం 4 గంటలకు మధురపూడి చేరుకున్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి కొంతసేపు విమానాశ్రయంలోనే నిలిచిపోవలసి వచ్చింది. చిరంజీవి కన్నా ముందు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మధురపూడి చేరుకుని రాజమండ్రి బయల్దేరారు. ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చిన వేలాది మంది అభిమానులు, ప్రజల వాహనాలతో మధురపూడి-రాజమండ్రి రోడ్డు కిక్కిరిసి ఉన్నందున పోలీసుల సూచన మేరకు చిరంజీవి 40 నిమిషాలపాటు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో గడిపారు.