- గణనీయంగా తగ్గిన విమాన ప్రయాణికులు
- రద్దయిన సర్వీసుల ఫలితం
- శనివారం నాలుగు సర్వీసులతో సరి
టేక్ ‘హాఫ్’
Published Sat, Dec 17 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
విమాన ప్రయాణాలకు సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. విమాన సర్వీసుల సంఖ్య తగ్గడం, అందుబాటులో ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. నిత్యం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఆరు సర్వీసులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణించేవి. శనివారం నాలుగు సర్వీసులు మాత్రమే ప్రయాణించాయి.
– మధురపూడి
కొద్ది రోజులుగా జెట్ ఎయిర్‌వేస్ చెన్నై సర్వీసు, ట్రూజెట్ బెంగళూరు సర్వీసు రద్దయిన సంగతి తెలిసిందే. గురువారం ప్రారంభించిన స్‌పైస్‌జెట్ మధ్యాహ్నం సర్వీసు కూడా రద్దయింది. ఇటీవల వచ్చిన వార్థా తుఫా¯ŒSతో చెన్నై సర్వీసులను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. అలాగే నిర్వహణ సమస్య కారణంగా మరికొన్ని రద్దయ్యాయి. తుఫా¯ŒS వీడిన తర్వాత కూడా çవిమాన సర్వీసులను ఆయా సంస్థలు పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. శనివారం కూడా ప్రయాణికుల సంఖ్య పెరగలేదు. ఒక్కొక్క సర్వీసుకు 35 నుంచి 55 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
నిలిచిన ప్రత్యేక సర్వీసులు
ఇటీవల మొదలైన ట్రూజెట్ ప్రత్యేక సర్వీసుల సేవలూ నిలిచిపోయాయి. వీటిలో ఓ సర్వీసు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజమహేంద్రవరానికి చేరి, సాయంత్రం 5.40కు గోవాకు బయలుదేరేది. ఉదయం వేళలో రాజమహేంద్రవరం–బెంగళూరు మధ్య ప్రయాణించే మరో సర్వీసు కూడా రద్దయింది. హైదరాబాద్–రాజమహేంద్రవరానికి, ఇక్కడి నుంచి చెన్నైకు ప్రయాణించే జెట్ సర్వీసులూ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.
నిత్యం వెయ్యి మందికి అసౌకర్యం
ఆరు విమాన సర్వీసుల్లో నిత్యం సుమారు వెయ్యి మంది ప్రయాణికులు రాజమహేంద్రవరానికి రాకపోకలు సాగించేవారు. ఇటీవల కేంద్ర ప్రభు త్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో పాటు తుఫా¯ŒS సమస్యతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శుక్రవారం వీరి సంఖ్య 230 మందికి తగ్గింది. దీంతో విమానాశ్రయం టెర్మినల్‌ను సందర్శించే విజిటర్స్ టిక్కెట్ల కొనుగోళ్లు కూడా తగ్గాయి. సాధారణంగా 120 మంది విజిటర్లు ఈ టిక్కెట్లు కొనేవారు. ఇది 38 మందికి తగ్గింది.
మళ్లించడం వల్లే..
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తుండడంతో పెద్ద విమానాల నిర్వహణ కష్టతరంగా మారిందని విమానయాన సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. అందువల్ల మంచును తట్టుకునే చిన్న విమానాలను ఆయా ప్రాంతాలకు మళ్లించారని చెప్పారు. ఇక్కడి చిన్న సర్వీసులను కూడా అక్కడకు తరలించినట్టు పేర్కొన్నారు.
సేవలను పెంపొందించాలి
విమాన సర్వీసులను రెగ్యులర్‌గా నిర్వహించడం చాలా అవసరం. ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు పూర్తి స్థాయి సేవలందేలా చర్యలు తీసుకోవాలి. విమానయాన సంస్థలు ప్రయాణికుల సేవలను పెంపొందించాలి.
– పిట్టా కృష్ణ, విమాన ప్రయాణికుడు, బూరుగుపూడి
సక్రమంగా నిర్వహించాలి
ప్రారంభించిన కొంత కాలానికే సర్వీసులను కొన్ని సంస్థలు రద్దు చేస్తున్నాయి. ఇది సమంజసం కాదు. విమానయాన సంస్థలు పూర్తి స్థాయిలో సేవలు అందించాలి. విమాన సర్వీసులను సక్రమంగా నిర్వహించాలి.
– ఆకుల రామకృష్ణ, విమాన ప్రయాణికుడు, మధురపూడి
Advertisement
Advertisement