ఓ ఊరికి ఆత్మ ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ: మల్లికార్జున్‌ | Director Mallikarjun Talks about Madhurapudi Gramam Ane Nenu Movie | Sakshi
Sakshi News home page

ఓ ఊరికి ఆత్మ ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ: మల్లికార్జున్‌

Published Thu, Oct 12 2023 1:20 AM | Last Updated on Thu, Oct 12 2023 11:31 AM

Director Mallikarjun Talks about Madhurapudi Gramam Ane Nenu Movie - Sakshi

శివ కంఠమనేని, క్యాథలిన్‌ గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లికార్జున్‌ దర్శకత్వంలో ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్‌ సమర్పణలో కేఎస్‌ శంకర్‌ రావు, ఆర్‌ వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మల్లికార్జున్‌ మాట్లాడుతూ – ‘‘ఓ మనిషికి ఆత్మ ఉంటుందన్నట్లుగానే.. ఓ ఊరికి ఆత్మ ఉంటే ఏం జరుగుతుందనే కల్పిత కథే ఈ చిత్రం.

ఓ వ్యక్తి మరో వ్యక్తి తలను నరికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడనే వార్తను నా చిన్నతనంలో చదివాను. ఆ విజువల్‌ను ఊహించుకుంటూ ఈ సినిమా కథను అల్లుకున్నాను. అయితే ఆ ఘటనకు, ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదు. పోరాటం, స్నేహం, రాజకీయం... ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న రా అండ్‌ రస్టిక్‌ ఫిల్మ్‌.

సూరి పాత్రలో హీరో శివ నా విజన్‌కి తగ్గట్లు నటించాడు. నిర్మాతలు బాగా సపోర్ట్‌ చేశారు. మణిశర్మగారి సంగీతం ఈ చిత్రానికి అదనపు బలం. కరోనా తర్వాత తెలుగు సినిమా మారిపోయింది. ఆరు ఫైట్లు.. ఆరు పాటలు అంటే ఆడియన్స్‌ చూడటం లేదు. కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమా తీశాను. ఇక ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో నా దగ్గర ఓ కథ ఉంది’’  అన్నారు. మవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement