ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన చిరంజీవి | Chiranjeevi wait in 40 minutes Madhurapudi Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన చిరంజీవి

Published Thu, Nov 14 2013 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

Chiranjeevi wait in 40 minutes Madhurapudi Airport

మధురపూడి, న్యూస్‌లైన్ : రాజమండ్రిలో జరిగే రెండు శుభకార్యాలకు హాజరయ్యేందుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బుధవారం సాయంత్రం 4 గంటలకు మధురపూడి చేరుకున్న కేంద్ర పర్యాటకశాఖ  మంత్రి చిరంజీవి కొంతసేపు విమానాశ్రయంలోనే నిలిచిపోవలసి వచ్చింది.

చిరంజీవి కన్నా ముందు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధురపూడి చేరుకుని రాజమండ్రి బయల్దేరారు. ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చిన వేలాది మంది అభిమానులు, ప్రజల వాహనాలతో మధురపూడి-రాజమండ్రి రోడ్డు కిక్కిరిసి ఉన్నందున పోలీసుల సూచన మేరకు చిరంజీవి 40 నిమిషాలపాటు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో గడిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement