రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి శనివారం 5 జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు సేవలందించాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సర్వీసు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అది శనివారం ఉదయం 9.10 గంటలకు హైదరాబాద్‌కు పయనమైంది.
5 జెట్ ఎయిర్‌వేస్ విమానాల సేవలు
Sep 17 2016 9:23 PM | Updated on Sep 4 2017 1:53 PM
మధురపూడి :
రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి శనివారం 5 జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు సేవలందించాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సర్వీసు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అది శనివారం ఉదయం 9.10 గంటలకు హైదరాబాద్‌కు పయనమైంది. అలాగే రోజూ 7.45 గంటలకు ఇక్కడికి చేరే మరో సర్వీసు యథాతథంగా చేరి, తిరిగి 8.05 గంటలకు చెన్నై బయలుదేరింది. 10.50 గంటలకు వచ్చిన మరో సర్వీసు 11.14 గంటలకు, మధ్యాహ్నం 1.55 గంటల సర్వీసు, 2.45 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరాయి. సాయంత్రం వచ్చిన మరో విమానం 6.05 గంటలకు ఇక్కడి నుంచి చెన్నైకి పయనమైంది.
Advertisement
Advertisement