17న జిల్లాకు జగన్‌ రాక | jagan comming east godavari 17th | Sakshi
Sakshi News home page

17న జిల్లాకు జగన్‌ రాక

Published Wed, Nov 9 2016 12:11 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

jagan comming east godavari 17th

  • ‘దివీస్‌’ నిర్వాసితులతో ముఖాముఖీ
  • వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ : 
    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష నేత వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఈ నెల 17న జిల్లాకు రానున్నారు. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో దివీస్‌ రసాయన పరిశ్రమ ఏర్పాటుతో నిర్వాసితులయ్యే   కుటుంబాలతో ఆయన మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మంగళవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. దివీస్‌ కర్మాగారం ఏర్పాటుతో భవిష్యత్తులో సుమారు 12 గ్రామాల ప్రజలు ఊళ్లకు ఊళ్లు ఖాళీచేసి వెళ్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దివీస్‌ బాధిత గ్రామాల్లో బా«ధితులతో జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ముఖాముఖీ నిర్వహించనున్నారని కన్నబాబు చెప్పారు. పోలీసుల సాయంతో సుమారు 60 రోజులుగా దివీస్‌ బాధిత గ్రామాల్లో 144 సెక్ష¯ŒS అమలుచేస్తూ గ్రామస్తులపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్న విషయంపై జగ¯ŒS మోహ¯ŒSరెడ్డి తీవ్ర ఆవేదన చెందుతున్నారని కన్నబాబు పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement